Ads
స్త్రీలు వేదాలకి పనికిరారు…వేదాలు చదవకూడదు అనే వాదన మనం ఇప్పటికీ వింటు ఉంటాం…!
దేవతలు అందరూ ఆడవాళ్లే…వేదాల అధిపతి గాయత్రి దేవి కూడా ఆడదే…వాక్కుని ప్రసాదించే సరస్వతి కూడా ఆడేదే…అయిన కూడా ఆడవాళ్ళకి ఎందుకు ఈ వివక్ష…వేదాలు ఎందుకు చదవకూడదు అని అన్నారు…
మనం వేదాలు చదివేటప్పుడు మన నాభి స్థానం నుండి అవి ఉత్పన్నం అవుతాయి.దాని ఫలితంగా వేడి ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది దాని వల్ల గర్భ సంచికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని పండితుల అభిప్రాయం.
అయితే ఇన్ని అడ్డంకులు ఉన్న పాండిత్యంలో ఋషులన్నీ ఓడించిన స్త్రీ గురించి మీరు విన్నారా…. ఆమె ఎవరో తెలుసా..? ఆమె పేరు గార్గి.వేదాంగ పా విధుషిమణులలో ముఖ్యమైనది ఈమె. ఆమె సృష్టి మూలానికి ఎందరో పండితులను,ఋషులను నిరుత్తరులను చేసిన గొప్ప స్త్రీ గార్గి. వచ్నకు మహర్షి కుమార్తె అయిన గార్గి పురాణ ప్రసిద్ధమైన బ్రాహ్మ వాదిని.తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అపర సరస్వతి గార్గి.
Ads
రామాయణంలో కూడా ఈమె గొప్పతనం గురించి ప్రస్తావన ఉంటుంది. జనకుడు జరిపించిన బ్రహ్మ యజ్ఞం అనే ఆధ్యాత్మిక గోష్టికి హాజరై అక్కడ జ్ఞానిగా పేరుగాంచిన యజ్ఞ వల్క మహర్షిని ఓడించింది. ఆమె వేసే ప్రశ్నలను తట్టుకోలేక ఇంకొక ప్రశ్న వేసిన సరే నీ తల వెయ్యి ముక్కలవుతుందంటూ మహర్షి శపించాడు. ఆమెకు సమాధానం చెప్పడం తమ వల్ల కాదని స్వయంగా చెప్పాడు. ఇలా వేదాలలో తన పాండిత్యాన్ని చాటుకుంటూ బ్రహ్మ వాదినిగా గార్గి పేరుగాంచింది.