HANUMAN REVIEW : “తేజ సజ్జా” నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!

Ads

ఈ సంక్రాంతికి తెలుగులో డజన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని పెద్ద సినిమాలే…వాటి మధ్యలో చిన్న మూవీ గా వచ్చింది హనుమాన్…!ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ తెచ్చుకున్న ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం….!

  • మూవీ : హనుమాన్
  • నటీనటులు: తేజా సజ్జా, అమృత అయ్యర్,వరలక్ష్మి శరత్ కుమార్,వినయ్ రాయ్,సముద్ర ఖని,వెన్నెల కిషోర్ తదితరులు…
  • దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
  • నిర్మాత: నిరంజన్ రెడ్డి
  • సంగీతం:అనుదీప్ దేవ్,గౌర హరి,కృష్ణ సౌరబ్
  • కెమెరా:దాశరథి శివెంద్ర
  • విడుదల తేదీ: జనవరి 12

hanuman review

కథ:

హనుమంతు(తేజా సజ్జా) చిల్లరిగా తిరిగే ఊరు అబ్బాయి. చిల్లర దొంగతనాలు చేస్తూ కాలం గడుపుతుంటాడు. ఆ గ్రామంపై పాలేగార్ల దౌర్జన్యాలు చేస్తూ ప్రజలను వేధిస్తుంటారు. అయితే బలహీనంగా ఉండే హనుమంతు వారిని ఎదురించడానికి ప్రయత్నించే క్రమంలో ఏం చెయ్యలేక చావుదెబ్బలు తిని సముద్రంలో పడిపోతాడు. సముద్రంలో పడిన హనుమంతుకు దివ్యమైన రుధిరమణి లభిస్తుంది. ఆ తర్వాత ఊహించని విధంగా అద్బుత శక్తి అతడికి లభిస్తుంది. అయితే హనుమంతు పరాక్రమశాలిగా మారిన విషయం తెలుసుకొన్న మైఖేల్ (వినయ్ రాయ్) ఆ గ్రామానికి వస్తాడు.

hanuman review

అంజనా గ్రామంలో అంజనమ్మ (వరలక్ష్మీ శరత్ కుమార్)కు హనుమంతుకు ఉన్న బంధం ఏమిటి? గ్రామంలోని మీనాక్షి (అమృతా అయ్యర్) ప్రేమను పొందడానికి హనుమంతు చేసిన సాహసం ఏమిటి? పాలెగాళ్ల చేతిలో గాయపడి సముద్రంలో పడిపోయిన హనుమంతుకు అక్కడ ఏం జరిగింది? సూపర్ హీరో కావడం ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకొన్న మైఖేల్ దుష్టపన్నాగాలకు హనుమంతు ఎలా అడ్డుకున్నాడు. ఈ దుష్ట శక్తులను ఎదురించే క్రమంలో ఆంజనేయస్వామి అనుగ్రహం హనుమంతుకు ఎలా లభించింది అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ.

hanuman review

విశ్లేషణ:

సూపర్ హీరో సినిమాలకు ఒక టెంప్లేట్ ఉంటుంది. ‘హనుమాన్’కూడా ఆ టెంప్లేట్ నుంచి బయటకు వెళ్లలేదు. అలాగని ఇది రొటీన్ సినిమా కాదు. తెలుగు నేటివిటీ మిస్ కాకుండా కామెడీతో పాటు క్యూరియాసిటీ కంటిన్యూ చేస్తూ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తీశారు. సూపర్ పవర్ కోసం విపరీతంగా ప్రయత్నించే విలన్, సాదాసీదా హీరో, సూపర్ పవర్ కోసం ఊరికి వచ్చిన విలన్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? అనేది క్లుప్తంగా ‘హనుమాన్’ కథ.

Ads

hanuman review

ముందు చెప్పినట్టు ఈ కథకు నేటివిటీ కామెడీ టచ్ ఇవ్వడంలో ప్రశాంత్ వర్మ సూపర్ సక్సెస్ అయ్యారు. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. హీరో తేజ సజ్జ క్యారెక్టర్ విషయంలో దర్శకుడి తెలివిగా వ్యవహరించారు. ముందు నుంచి హీరో ధీరుడు, సూరుడు, వీరుడు అంటూ చూపించ కుండా ఒక సామాన్యుడిగా పరిచయం చేశారు. తేజ సజ్జ ఫైట్స్ చేస్తే ప్రేక్షకులు నమ్మేలా ఆ సన్నివేశాలన్నీ రూపొందించారు. చివరకు హనుమంతుడిని సైతం కథలోకి తెలివిగా తీసుకొచ్చారు. అలాగని సినిమాలో ఇబ్బంది పెట్టే సన్నివేశాలు లేవని కాదు. పాలెగాడు సీన్లు, కొన్ని క్యారెక్టర్లను డిటైల్డ్‌గా చూపించడంతో కొద్దిగా నిడివి పెరిగింది.

hanuman review

విలన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ బాగా చేశారు. అయితే అతని నేపథ్యాన్ని పూర్తిగా వివరించలేదు.ప్రశాంత్ వర్మ ఇచ్చిన కంటెంట్ కి ఆ లోపాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక నటీనటుల విషయానికి వస్తే… హనుమంతుడి పాత్రలో తేజ్జ సజ్జ ఒదిగిపోయారు. ప్రతి దాంట్లోనూ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అమృత అయ్యార్ కూడా అండంతో మెప్పించారు. వరలక్ష్మి శరత్ కుమార్ ఫైట్స్ వచ్చినప్పుడు విజిల్ వెయ్యకుండా ఉండలేం…వినయ్ రాయ్ మరోసారి స్టైలిష్ విలన్ రోల్ చేశారు. గెటప్ శ్రీను, సత్య, జబర్దస్త్ రోహిణి, రాకేష్ మాస్టర్ తదితరులు నవ్వించారు. విభీషణుడిగా సముద్రఖని హుందగా ఉన్న పాత్రలో నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • కథ స్క్రీన్ ప్లే
  • VFX క్వాలిటీ
  • యాక్షన్ సీన్స్
  • సంగీతం
  • ప్రశాంత్ వర్మ బ్రిలియన్స్
  • ఫ్యామిలీ, పిల్లలు కలిసి చూసే సినిమా

మైనస్ పాయింట్స్:

  • కొన్ని ల్యాగ్ సీన్స్

రేటింగ్:

3.5/5

ఫైనల్ గా:

ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడగలిగే చక్కని సినిమా… భక్తి రసంతో గుస్ బంప్స్ తెప్పిస్తుంది.సంక్రాంతి మొదటి విన్నర్.

watch trailer :

Previous articleసంక్రాంతికి విడుదల అయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..! వాటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?
Next articleGUNTUR KAARAM REVIEW : మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంతవరకు మెప్పించింది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్!