ఆ హీరోతో త్రివిక్రమ్ గొడవ పడ్డారా..? కారణం ఏంటంటే..?

Ads

తెలుగులో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కి ఉన్న స్టామినా ఏంటో అందరికీ తెలిసిందే. రైటర్ గా మొదలైన ఆయన ప్రస్థానం ఈరోజు స్టార్ డైరెక్టర్ వరకు కొనసాగుతూనే ఉంది. త్రివిక్రమ్ తో పని చేసేందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

అయితే త్రివిక్రమ్ డైరెక్షన్ లో తాజాగా వచ్చిన గుంటూరు కారం సినిమా నేడు విడుదల మంచి టాక్ తో దూసుకుపోతుంది. అయితే గతంలో త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసే రోజుల్లో ఒక తమిళ్ హీరో తో గొడవ పడ్డాడట. ఇప్పుడు ఈ విషయం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాగా వైరల్ అవుతుంది.

Ads

అసలు విషయంలోకి వెళ్తే… త్రివిక్రమ్ తన కెరీర్ ప్రారంభించిన సమయంలో పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసేవాడు. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ కూడా అప్పుడప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే విక్రమ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకి త్రివిక్రమ్ పనిచేస్తున్న సమయంలో ఒక సీను వివరించే సమయంలో విక్రమ్ కి త్రివిక్రమ్ కి గొడవ అయిందట. ఇద్దరూ ఒకరి మీద ఒకరు అరుచుకున్నారట. అయితే ఆ సినిమా డైరెక్టర్ పిలిచి సర్ది చెప్పడంతో గొడవ సర్దుమనిందట.

trivikram issue with this hero

అయితే ఇప్పుడు విక్రమ్ స్టార్ హీరో అయ్యాడు.త్రివిక్రమ్ తెలుగులో స్టార్ డైరెక్టర్ అయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తీయాలని చాలామంది ప్రయత్నించిన ఇద్దరికీ జరిగిన గొడవ కారణంగా విక్రమ్ గాని, త్రివిక్రమ్ గాని ఆసక్తి చూపించలేదు అని వినిపిస్తుంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇందులో నిజంతో అబద్ధంతో ఎవరికీ తెలియదు.ఈ విషయం పైన విక్రమ్ కాని, త్రివిక్రమ్ కాని ఓపెన్ అయితే స్పష్టత వస్తుంది

Previous articleఇన్ని పెద్ద సినిమాల మధ్యలో విజయ్ సేతుపతి సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యిందా..? ఎలా ఉందంటే..?
Next articleధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా చూశారా..? ఎలా ఉందంటే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.