Ads
సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమా సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 900 కోట్లు సాధించింది.
అయితే తాజాగా యానిమల్ సినిమా ఓటిటి వెర్షన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.ఈ సినిమా హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుని ప్రసారాన్ని మొదలుపెట్టింది.
యానిమల్ సినిమా ధియేటర్ వెర్షన్ 3 గంటల 27 నిమిషాలు గా ఉండగా ఫైనల్ కట్ అయితే మూడు గంటల 46 నిమిషాలు ఉంటుందని సినిమా టీం ప్రకటించింది.అయితే ఓటిటిలో ఫుల్ వెర్షన్ ప్రసారం చేస్తామని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా చూసిన అభిమానులకు షాక్ తగిలింది.
Ads
ఈ సినిమాలో ఎక్స్ట్రా సీన్లు యాడ్ అవుతాయని ఆశగా ఎదురుచూసిన వారందరికీ కూడా నిరాశ ఎదురయింది. నెట్ ఫ్లిక్స్ లో థియేటర్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. కేవలం రెండు మూడు సీన్లు మినహాయిస్తే అభిమానులు ఆశించినంతగా ఇందులో ఏమీ లేదు. అసలు ఇందులో ఫుల్ వెర్షన్ లేకపోవడానికి గల కారణం కూడా తెలిసింది. ప్రసార సంస్థ నెట్ ఫ్లిక్స్ కేవలం సెన్సార్ అయిన వెర్షన్ మాత్రమే తమ యాప్ లో ప్రసారం చేస్తున్నట్లు తెలిసింది.
అందుమూలం గానే యానిమల్ సినిమా ఎక్స్ట్రా సీన్లు లేవని చెబుతున్నారు. యానిమల్ సినిమాని థియేటర్లలో చూడలేని వారు కూడా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా యానిమల్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు.ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఆత్రుతగా ఉన్నారు