Ads
కేంద్రం ఆర్థిక శాఖ పార్లమెంట్లో బడ్జెట్ పత్రాల సమర్పించే ముందు ఆనవాయితీగా హల్వా వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు ఆర్థిక శాఖ అధికారులు, బడ్జెట్ ముద్రణలో పాల్గొన సిబ్బంది అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
హల్వా వేడుక సాంప్రదాయకంగా భారతదేశంలో బడ్జెట్ పత్రాల ముద్రణతో ముడిపడి ఉంటుంది. ఇది బడ్జెట్ సెషన్లో పార్లమెంటులో సమర్పించబడిన బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ ప్రారంభానికి సూచిక.
బడ్జెట్ తయారీకి సంబంధించి గోప్యతను పాటించడానికి ఈ వేడుక ముఖ్య ఉద్దేశం.
Ads
బడ్జెట్ పత్రాల ముద్రణ ముగిసిన తర్వాత వాటి గోప్యతను కాపాడేందుకు బడ్జెట్ తయారీలో పాల్గొన అధికారులు సిబ్బంది అందరూ కూడా బహిర్గతంగా ఎటువంటి చర్చ చేయకుండా బాహ్య ప్రభుత్వంతో పని లేకుండా ఉండాలి. ఈ కాలంలో సిబ్బంది తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎవరితోనూ ఫోన్ కాంటాక్ట్ గాని, ఈమెయిల్ కాంటాక్ట్ గాని లేకుండా నిలువరించబడతారు. దాదాపు 100 మంది అధికారులు ఈ బడ్జెట్ తయారీలో పాల్గొంటారు. కేవలం సీనియర్ అధికారులు మాత్రమే ప్రాంగణాన్ని విడిచి బయటకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
మిగతా వారందరినీ కూడా బడ్జెట్ పత్రాలు సమర్పించే కార్యక్రమం పూర్తయ్యేంతవరకు నార్త్ బ్లాక్ లో ఒకచోట ఉంచి తాళం వేస్తారు. ఫిబ్రవరి ఒకటో తారీఖున బడ్జెట్ సమర్పణ పూర్తయిన తర్వాతే వీరందరూ బయటికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ బడ్జెట్ కార్యక్రమం గోపి అతను చాటి చెప్పేందుకే హల్వా వేడుకలు నిర్వహించటం సాంప్రదాయంగా వస్తుంది.