Ads
నందమూరి బాలకృష్ణ ఒక పక్క వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, తాజాగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలు మూడు కూడా 100 కోట్ల క్లబ్లో చేరాయి. దీంతో బాలకృష్ణ మరింత దూకుడుగా మరిన్ని సినిమాలను లైన్లో పెట్టారు. అయితే తాజాగా బాలకృష్ణ తీసుకునే రెమ్యూనరేషన్ విషయం టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది.
గతంలో బాలకృష్ణకి వరస ఫ్లాపులు చుట్టుముట్టాయి. తర్వాత కథలు ఎంచుకునే విషయంలో బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో మంచి కథలన్నీ బాలకృష్ణ ఎంచుకుంటున్నారు. ఎటువంటి కథ చేయాలి, ఏ దర్శకుడుతో చేయాలి అని ఆమె సలహాలు కూడా తీసుకుంటున్నారట.
Ads
ఇండస్ట్రీలో రెమ్యునిరేషన్ విషయంలో బాలకృష్ణ నిర్మతలను పెద్దగా ఇబ్బంది పెట్టరట. బాలకృష్ణకు ఆ మంచి పేరు ఉంది. మొన్నటి వరకు బాలకృష్ణ రెమ్యూనిరేషన్ 10 నుంచి 15 కోట్ల వరకు ఉండేది. అయితే వరుస హిట్ల మీద ఉండడంతో ప్రస్తుతం మెగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి బాలకృష్ణ అడగకుండానే నిర్మాతలు 30 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లిస్తున్నారట. దీంతో బాలకృష్ణ రాబోయే సినిమాలన్నీ కూడా ఈ రేంజ్ రెమ్యూనిరేషన్ తీసుకుంటారని అంటున్నారు. ఒక్కసారిగా బాలయ్య రెమ్యూనరేషన్ డబుల్ అవడంతో ఇండస్ట్రీ వర్గాలన్నీ దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. ఒకపక్క అన్ స్టాపబుల్ షోలో కూడా బాలయ్య బిజీగా గడుపుతున్నారు. ఈ షో కోసం బాలకృష్ణకి ఎపిసోడ్ కి భారీగానే చెల్లిస్తున్నారని వినికిడి.