“దయచేసి ఇందులోకి నా తల్లిదండ్రులని లాగకండి..!” అంటూ… 90’s నటుడు “మౌళి” ఎందుకు రిక్వెస్ట్ చేశాడు..? ఆ వీడియోలో ఏం అన్నాడు..?

Ads

’90s’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ లో నటుడు మరియు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ, తొలిప్రేమ ఫేమ్ వాసుకి లీడ్ రోల్స్ లో  నటించారు.

Ads

90 ల మధ్యతరగతి కుటుంబాల లైఫ్, అప్పటి పిల్లల ఆలోచనలు వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్ పై సోషల్ మీడియాలో సైతం విపరీతంగా చర్చ జరిగింది. ఒక తెలుగు సిరీస్ గురించి ఈ స్థాయిలో చర్చలు జరగడం ఇదే మొదటిసారి. ఇక ఈసిరీస్ లో నటించిన పిలల్లకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ’90s’ మౌళి కాంట్రావర్సిలో చిక్కుకున్నాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
’90s’ సిరీస్ తో ఇందులో నటించిన అందరికీ మంచి గుర్తింపు వచ్చింది. నటుడు శివాజీ. వాసుకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక ఈ సిరీస్‌తో మౌలి ఎక్కువ పాపులర్ అయ్యాడు. అంతకుముందే మౌలికి సోషల్ మీడియాలో క్రేజ్ ఉంది. అతని ఫన్నీ వీడియోలు నవ్విస్తుంటాయి. ఎక్కువగా రీల్స్, ట్రోల్స్ వీడియోలు చేస్తుంటాడు.  యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. తాజాగా మౌలి చేసిన ఒక వీడియో కాంట్రావర్సి అయ్యింది.
తాజాగా మౌలి ఒక వీడియోతో నెట్టింట్లో వైరల్ గా గా మారాడు. ఆ వీడియోలో ఒక మ్యాజిక్ చేస్తాను అంటూ చేతిని క్లోజ్ చేసి, మళ్ళీ చేతిని తెరచి ఒకదాన్ని మాయం చేశా, అది ఏమిటో తెలుసా, ఏపీ క్యాపిటల్,  ఎక్కడా దొరకదు. కనిపించదు అని జోక్ చేశాడు. దీంతో మౌలిని నెట్టింట్లో నెటిజెన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. అతన్నే కాకుండా, మౌళి అమ్మా, నాన్నలను సైతం దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.ట్రోలింగ్ నేపథ్యంలో మౌలి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో క్షమించమని కోరుతూ పోస్ట్ చేశాడు. తాను వేసిన జోక్ పైన పెద్ద ఎత్తున నెగెటివిటీ వస్తోంది. అందులో ఎటువంటి రాజకీయ ఉద్దేశం కానీ ఎవరినీ కించపర్చాలని అనుకోలేదు. ఎవరి మనోభావాలు అయిన దెబ్బ తింటే క్షమించండి. తన పేరంట్స్ ని ఇందులోకి లాగవద్దని వేడుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Also Read: “భద్ర” మూవీలో ఈ 2 సీన్లు గమనించారా..? భలే మోసం చేసారుగా పాపం.!

 

Previous article“గుప్పెడంత మనసు” సీరియల్ లో రిషి ఫోటోకి దండ..? ఈ ట్విస్ట్ ఏంటి..?
Next articleయాత్ర-2 సినిమా కోసం… హీరో జీవా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.