ఉపాసన చెప్పిన బౌండరీస్ అంటే ఏంటి..? భార్యాభర్తలు ఇవి ఎందుకు ఫాలో అవ్వాలి..?

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు రామ్ చరణ్, ఉపాసన. వీరిద్దరు పెళ్లి అయ్యి దాదాపు 10 సంవత్సరాలు దాటింది. కెరీర్ పరంగా కూడా ఇద్దరూ చాలా మంచి స్థాయికి వెళ్లారు. అయితే ఈ మధ్యలో వీరికి కామెంట్స్ కూడా ఎదురైన సందర్భాలు ఉన్నాయి.

అందులోనూ ముఖ్యంగా పిల్లల గురించి. వీళ్ళిద్దరూ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా ఎక్కడో ఒకచోట పిల్లల గురించి అడిగారు. 10 సంవత్సరాల వరకు వీళ్లు ఇలాంటి ఎన్ని కామెంట్స్ వచ్చినా కూడా ఓపికగా భరించి, వాళ్లు ఎప్పుడు కనాలి అనుకుంటే అప్పుడే పిల్లలని ప్లాన్ చేసుకున్నారు.

గత సంవత్సరం వీళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. అప్పుడు కూడా ఉపాసన ఈ పెళ్లి అయ్యాక, పిల్లలు పుట్టే మధ్యలో ఉన్న సమయంలో తనకి ఎన్నో కామెంట్స్ వచ్చాయి అని, కానీ తాను, రామ్ చరణ్ కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు. ఎన్ని అన్నా కూడా వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడే పిల్లల్ని కన్నాము అని చెప్పారు. అయితే ఉపాసన ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, “రామ్ చరణ్ ప్రేమలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఎదుగుతారు” అని అంటారు అని అన్నారు.

ప్రేమ అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి తమ జీవితాల్లో ముందుకు సాగడం అనే ఒక ఆలోచనని రామ్ చరణ్ నమ్ముతారు అని చెప్పారు. వీళ్ళిద్దరూ ఎంత కలిసి ఉన్నా కూడా, కొన్ని బౌండరీస్ అంటూ ఉన్నాయి అని అన్నారు. అయితే, ఉపాసన చెప్పిన ఈ బౌండరీస్ అనేది చాలా ముఖ్యమైన విషయం. దీని మీద ఒక్కొక్కరికి భిన్న రకమైన అభిప్రాయాలు ఉంటాయి. కానీ, ఎంతో మంది మానసిక నిపుణులు కూడా భార్యాభర్తలు ఎంతగా కలిసి ఉన్నా కూడా ఈ బౌండరీస్ అనేవి ముఖ్యం అని చెప్తారు.

Ads

అయితే బౌండరీస్ అనంగానే అదేదో ఒక తప్పుడు పదంలాగా అర్థం అవుతుంది. “భార్య భర్తల మధ్య ఈ హద్దులు ఏంటి? అలా చేయడం తప్పు కదా?” అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సాధారణంగా ఎవరైనా ఒక భార్య తన భర్త విషయాల్లో, లేదా ఒక భర్త తన భార్య విషయాల్లో అతిగా జోక్యం చేసుకుంటూ ఉంటారు. వాళ్లు కూడా మనుషులే అని, వాళ్లకి కూడా ప్రైవసీ అనేది ఒకటి ఉంటుంది అని మర్చిపోతారు.

వ్యక్తిగతంగా ఇద్దరూ కలిసి నిర్ణయించుకునే విషయాల్లో అయితే ఇలాంటి జోక్యం చేసుకోవడం కరెక్ట్ గానే అనిపిస్తుంది. కానీ కెరీర్ కి సంబంధించిన విషయాలు, లేదా వారి ఒక్కరికి మాత్రమే సంబంధించిన విషయాలు ఆ ఒక్క వ్యక్తి మాత్రమే తీసుకోవాలి. ఎంత భార్య అయినా, లేక భర్త అయినా కూడా వాటిలో జోక్యం చేసుకోకూడదు. ఉపాసన చెప్పింది కూడా ఇదే.

కెరీర్ పరంగా రామ్ చరణ్ కెరీర్ విషయంలో ఉపాసన కానీ, ఉపాసన కెరీర్ విషయంలో రామ్ చరణ్ కానీ జోక్యం చేసుకోరు. ఒకరి నిర్ణయాలని మరొకరు గౌరవిస్తారు. ఇది కేవలం సెలబ్రిటీల విషయంలో మాత్రమే కాదు. సాధారణంగా భార్యాభర్తల విషయంలో ఇది చాలా ముఖ్యం. ఉపాసన చెప్పిన బౌండరీస్ అనేది ఒక రిలేషన్ లో కచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆ రిలేషన్ ఆరోగ్యకరంగా ఉంటుంది.

ALSO READ : ఒకే స్టడీ మెటీరియల్ చదివి, ఒకే ఏడాది, ఐఏఎస్ సాధించిన అక్కాచెల్లెళ్ళ సక్సెస్ స్టోరీ..!

Previous articleయాత్ర-2 సినిమా కోసం… హీరో జీవా తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
Next articleపూజకి ఉపయోగించే పూలల్లోనూ కొన్ని పద్ధతులు వున్నాయి..ఈ తప్పులని మాత్రం అస్సలు చెయ్యద్దు..!