Ads
బుల్లితెర పై ప్రసారం అయ్యే సీరియల్స్ కి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. సీరియల్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయితే అందులోని క్యారెక్టర్లను ఎంతగానో అభిమానిస్తూ, ఇంట్లోవారిలానే చూస్తారు.
Ads
అలాంటి క్యారెక్టర్ చనిపోతే తట్టుకోలేక డైరెక్టర్ పై మండిపడుతుంటారు. కొందరు నెట్టింట్లో వారి ఆగ్రహాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి గుప్పెడంత సీరియల్ డైరెక్టర్ కి ఎదురయ్యింది. రిషి పాత్రను చంపేయడంతో ఫ్యాన్స్ సీరియల్ దర్శకుడి పై ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
టెలివిజన్ వర్గాల్లో గుప్పెడంత మనసు సీరియల్ ఇష్యూ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కారణం రిషి పాత్ర. గత మూడు నెలలుగా సీరియల్ లో రిషి పాత్ర కనిపించడం లేదు. కొన్నిరోజులు రిషి కిడ్నాప్ అయ్యాడని సీరియల్ కొనసాగించగా, కొన్నాళ్లూ రిషి జైలుకి వెళ్లాడని, ఆ తరువాత యాక్సిడెంట్ జరిగిందని, కొన్నిరోజులు ట్రీట్మెంట్ జరుగుతుందంటూ రిషి క్యారెక్టర్ చుట్టూనే స్టోరీని తిప్పుతూ, నడిపిస్తున్నారు. రిషి వస్తాడని ఎదురుచూసిన సీరియల్ ఫ్యాన్స్ కి షాక్ ఇస్తూ ఆఖరికి రిషి చనిపోయాడంటూ ఫోటోకి దండ వేసేశారు.
మరోవైపు వసుధారతో రిషి తిరిగి వస్తాడంటూ చెప్పిస్తున్నారు. అయితే రిషి పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ తిరిగి వచ్చేలా కనిపించడం లేదు. అసలు ముఖేష్ గౌడ ఎప్పుడొస్తాడో అనే విషయం సీరియల్ యూనిట్ తెలియదంట. యూనిట్ కి, ముఖేష్ గౌడ మధ్య ఏం జరిగిందో కానీ, ముఖేష్ కొన్ని రోజులు అనారోగ్యం అని, ఆ తరువాత అతని తండ్రి మరణించాడని, ఆ తరువాత పర్సనల్ ప్రాబ్లమ్ అంటూ షూటింగ్‌కి రావడం లేదంట. దీంతో అతన్ని సీరియల్ నుండి తొలగించలేక, కొనసాగించలేక సతమతం అవుతున్నారని తెలుస్తోంది. అయితే ఎంతకి ముఖేష్ గౌడ షూటింగ్‌కి రాకపోవడంతో విసిగిపోయి చివరికి రిషి పాత్రను చంపేశారట.
అయితే రిషి పాత్రనుఅభిమానించే ‘గుప్పెడంత మనసు’ సీరియల్ అభిమానులు, రిషి లేని సీరియల్ ను ఊహించుకోలేమంటూ, రిషి పాత్రను చంపేసిన సీరియల్ డైరెక్టర్ ను తిడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. దాంతో దర్శకుడు వారికి సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ‘రిషి ఎప్పుడు వస్తాడు అనేది మాకే క్లారిటీ లేదు. చూస్తే చూడండి. మీ ఇష్టం. అంతేకాని ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేయొద్దు’ అంటూ కామెంట్ చేశాడు. అంతేకాకుండా తాజాగా ఎపిసోడ్‌లో శైలేంద్ర ద్వారా ‘అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి.. లేదంటే ఇలాగే ఉంటుంది’ అనే డైలాగ్ తో ముఖేష్ గౌడకి స్ట్రాంగ్ కౌంటర్లు వేయించారని అంటున్నారు.
Also Read: EAGLE REVIEW : “రవితేజ” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!