Ads
ఇటీవల పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇప్పుడు అలాగే రాజధాని ఫైల్స్ సినిమా వచ్చింది. ఈ సినిమా నిన్న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం: రాజధాని ఫైల్స్
- నటీనటులు: వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, అఖిలన్, వీణ, విశాల్ పాట్నీ, పవన్.
- దర్శకుడు: భాను
- సంగీతం: మణిశర్మ
- నిర్మాత : కంటమనేని రవిశంకర్
- రిలీజ్ డేట్ : ఫిబ్రవరి 15, 2024
కథ:
అరుణప్రదేశ్ లో కత్తి గుర్తు ఉన్న కేఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. అప్పటి వరకు అయిరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలి అనుకుంటారు. కానీ ముఖ్యమంత్రి ఆ తర్వాత నాలుగు రాజధానులు అని అంటారు. రైతులు ఉద్యమాలు సాగిస్తూ ఉంటారు. అక్కడ రైతులకు ప్రతినిధులుగా ఒక కుటుంబం (వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, అఖిలన్) ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? అక్కడ జరిగిన పరిణామాలు ఏంటి? ఈ కుటుంబం వాళ్ళు రైతులతో కలిసి ఏం చేశారు? ఇదంతా తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఇటీవల రాజకీయ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా అలాంటి కోవకు చెందినదే. హీరో కొత్త అతను. కానీ సినిమాలో సీనియర్ నటులు వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత వీళ్లు తెర మీద కనిపించారు. ఇంకా సినిమా కథ విషయానికి వస్తే రైతులని అంశంగా పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఎక్కువ రైతుల గురించి, వాళ్ళు ఎదుర్కొనే సంఘటనల గురించి ఇందులో చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కాస్త ల్యాగ్ చేసినట్టు ఉంటుంది. కొన్ని సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి.
Ads
ఇంక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సినిమాలో ఉన్న నటినటులు అందరూ కూడా వాళ్ళ పాత్రలకి తగ్గట్టు చేశారు. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్ సీనియర్ నటులు కాబట్టి వాళ్లు ఎలాంటి పాత్రని అయినా చేయగలుగుతారు. ఈ సినిమాలో కూడా అలా చేశారు. వాళ్ల కొడుకు పాత్రలో నటించిన అఖిలన్ కూడా బాగా నటించారు. ఇది అఖిలన్ మొదటి సినిమా. కానీ సినిమా చూస్తున్నప్పుడు అలా అనిపించదు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం సాగదీసినట్టు అనిపిస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్:
- నటీనటుల పర్ఫార్మెన్స్
- కొన్ని ఎమోషనల్ డైలాగ్స్
మైనస్ పాయింట్స్:
- ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ నిడివి
- సాగదీసినట్టుగా అనిపించే కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్:
2.75/5
ఫైనల్ గా:
రైతుల గురించి ఈ సినిమాలో చూపించారు. ఇటీవల వచ్చిన పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాల్లో ఒకటిగా రాజధాని ఫైల్స్ సినిమా కూడా తెలుస్తుంది.
watch trailer :
ALSO READ : ఓయ్ సినిమా డైరెక్టర్ భార్య ఇంత పెద్ద సెలబ్రిటీ అని తెలుసా..? ఆమె ఎవరంటే..?