అప్పట్లో షారుఖ్ ఖాన్, మహేష్ బాబు వంటి స్టార్లు ప్రమోట్ చేసిన “బైజూస్” పరిస్థితి ఇప్పుడు ఇలా తయారయ్యింది ఏంటి..? ఏం జరిగిందంటే..?

Ads

సినిమా హీరోలు అన్న తర్వాత ఎన్నో సంస్థలని ప్రమోట్ చేస్తారు. ముఖ్యంగా పెద్ద హీరోలు అయితే ఎన్నో పేరు పొందిన బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తారు. కొన్ని సంస్థలు ఆ హీరోల పాపులారిటీ వల్ల, వారే వచ్చి హీరోలని తమ ఉత్పత్తులని ప్రమోట్ చేయమని అడుగుతారు.

అలా హిందీలో షారుఖ్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు ప్రమోట్ చేసిన సంస్థ బైజూస్. ఇది ఒక ఆన్ లైన్ లర్నింగ్ యాప్. దీని ద్వారా ఇంట్లోనే తమ పిల్లలకి ఉత్తమమైన విద్యని అందించవచ్చు. ఆలోచన బాగుండడంతో మన హీరోలు కూడా దీన్ని ప్రమోట్ చేయడానికి ముందుకి వచ్చారు.

byjus office issue in bengaluru

దాని తర్వాత బైజూస్ వాడకం కూడా ఎక్కువగానే పెరిగింది. అయితే, ఇప్పుడు బైజూస్ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఒక సమయంలో ఎన్నో లాభాలు చూసిన ఈ సంస్థ, ప్రస్తుతం అద్దె కట్టడానికి కూడా ఇబ్బందులు పడుతోంది. వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని ప్రెస్టైజ్ టెక్ పార్క్ లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆఫీస్ ఖాళీ చేశారు. ఇందుకు కారణం వారు ఖర్చులు తగ్గించుకోవాలి అనుకోవడం. ఈ ఆఫీస్ రెంటల్ అగ్రిమెంట్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే రద్దు చేసుకున్నట్టు సమాచారం.

byjus office issue in bengaluru

కొంత కాలంగా అద్దె చెల్లించలేదు. అందుకే ముందు చెల్లించిన డిపాజిట్ తోనే సర్దుబాటు చేసుకున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా, ఇంకా కొన్ని చోట్ల కూడా అద్దెకి సంబంధించిన వివాదాలు జరుగుతున్నాయి. ప్రెస్టైజ్ గ్రూప్‌తో దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం ఆఫీస్ కోసం బైజూస్ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రెంటల్ అగ్రిమెంట్ లో రాసినంత వరకు నెలకి దీని కోసం 4 కోట్లు అద్దె చెల్లించాలి.

byjus office issue in bengaluru

Ads

కానీ కొంత కాలంగా ఇబ్బందుల్లో ఉన్న కారణంగా, బైజూస్ అద్దె కట్టలేక, భవనాన్ని ఇప్పుడు ఖాళీ చేసేసారు. అయితే, బెంగుళూరులో ఉన్న కళ్యాణి టెక్ పార్క్ లో 5 లక్షల చదరపు అడుగులలో ఇంకొక ఆఫీస్ స్థలం ఉంది. కానీ దానికి కూడా సరిగ్గా అద్దె కట్టట్లేదు అని సమాచారం. దాంతో కళ్యాణి డెవలపర్స్ సంస్థ కూడా వీరికి లీగల్ నోటీసులు పంపారు. మార్చి 2025 వరకు వీరి ఒప్పందం ఉంది. కానీ 10 నెలలుగా వీళ్ళు అద్దె చెల్లించకపోవడంతో, ముందస్తు డిపాజిట్ తో 7 నెలల అద్దె సర్దుబాటు చేసినట్టు సమాచారం.

byjus office issue in bengaluru

రవీంద్రన్, దివ్యా గోకుల్‌నాథ్ కలిసి ఈ సంస్థని 2011 లో ప్రారంభించారు. కోవిడ్ సమయంలో వీటి వాడకం చాలా ఎక్కువగా అయ్యింది. కానీ తర్వాత పరిస్థితులు సాధారణం అవ్వడంతో, వాడే ప్రజలు తగ్గారు. విదేశాల్లో కూడా వీరి సంస్థకు సంబంధించిన బ్రాంచ్ లు విస్తీర్ణం చేయడంతో ఖర్చు పెరిగింది. అప్పులు కూడా పెరిగాయి. వాటిని తిరిగి చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విదేశీ నిధులకి సంబంధించి మనీలాండరింగ్ వార్తలు కూడా వచ్చాయి. ఉద్యోగులకి జీతాలు సరిగ్గా చెల్లించట్లేదు.

byjus office issue in bengaluru

పీఎఫ్ బకాయిలు కూడా సరిగ్గా ఇవ్వలేదు. అయితే బోర్డు నుండి సంస్థ ఓనర్ అయిన రవీంద్రన్ ని తప్పించాలి అని వీరు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కళ్యాణి టెక్ పార్క్ లో బైజూస్ ఆఫీస్ ఉంది. పేరుకి ఆఫీస్ ఉన్నా కూడా, అక్కడ నుండి ఎవరూ పని చేయట్లేదట. ఈ సంస్థకి దేశం మొత్తంలో 3 మిలియన్ చదరపు అడుగులకి పైగా రెంటడ్ ఆఫీస్ స్థలాలు ఉన్నాయి. దాంతో ఎక్కడి నుంచి అయినా పనిచేసే వీలు ఉంటుంది. ఇది గతంలో బైజూస్ ప్రతినిధి చెప్పారు. ప్రస్తుతం అయితే బైజూస్ 4 లక్షల చదరపు అడుగుల్లో ఉన్న ప్రెస్టైజ్ టెక్ పార్క్ లోని ఆఫీస్ ని ఖాళీ చేశారు.

ALSO READ : వైయస్ షర్మిల కొడుకు పెళ్లి జరిగే ఈ “ఉమైద్ భవన్ ప్యాలెస్” లో పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Previous article5 కోట్ల బడ్జెట్… హైదరాబాద్ బ్యాక్ డ్రాప్… కట్ చేస్తే కలెక్షన్ల వర్షం..! అసలు అంతగా ఈ సినిమాలో ఏం ఉంది..?
Next article9 ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ సినిమాకి… ఇప్పుడు సీక్వెల్..! ఈ సినిమా చూశారా..?