Ads
తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించి, ఇప్పుడు జవాన్ సినిమాతో డైరెక్ట్ హిందీ సినిమాలో కూడా నటించారు నయనతార. నయనతార ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయ్యింది. కానీ ఇప్పటికి కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
రౌడీ పిక్చర్స్ పేరుతో తన భర్తతో కలిసి సొంత బ్యానర్ స్థాపించి, తన సినిమాలని ఈ బానర్ ద్వారా నిర్మించడం మాత్రమే కాకుండా, ఎంతో మంది యంగ్ ఫిలిం మేకర్స్ కి అవకాశం ఇస్తున్నారు. నయనతార తెలుగు సినిమాల్లో చాలా తక్కువగానే నటిస్తున్నారు.
కానీ నటించినప్పుడు కూడా మంచి పాత్రల్లో మాత్రమే నటిస్తున్నారు. జవాన్ సినిమా తర్వాత నయనతారకి హిందీ నుండి కూడా అవకాశాలు రావడం మొదలు అయ్యాయి. కానీ నయనతార చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. నయనతార ఇటీవల టెస్ట్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ఇందులో నయనతారతో పాటు మీరా జాస్మిన్, మాధవన్, హీరో సిద్ధార్థ్ కూడా నటించారు. ఇంకొక సినిమా కూడా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Ads
ఇంకా చాలా సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. అయితే, నయనతార బయటికి వచ్చినప్పుడు చాలా వరకు చీరల్లోనే కనిపిస్తారు. ఎన్నో రకమైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీరలని నయనతార కడతారు. నయనతార చీరలకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల నయనతార దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ కి హాజరు అయ్యారు. ఇందులో జవాన్ సినిమాకి నయనతారకి ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఈ ఈవెంట్ కి నయనతార కట్టుకొచ్చిన చీర అందరి దృష్టిని ఆకర్షించింది. ఎల్లో కలర్ చీరలో సింపుల్ గా వెళ్లారు నయనతార.
దాంతో, “ఈ చీర ధర ఎంత?” అని తెలుసుకోవడం మొదలు పెట్టారు. అయితే చీర సింపుల్ గా ఉన్నా కూడా, ధర మాత్రం ఎక్కువగానే ఉంది. ఈ చీరని ఎకాయ బనారస్ అనే బ్రాండ్ నుండి నయనతార తీసుకున్నారు. ఈ చీర ధర 14,975 రూపాయలు. దీనికి ఇంత కాస్ట్ ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇది చేతితో నేసిన చీర. సిల్క్ క్లాత్ తో దీన్ని చేశారు. ఇది లెమన్ ఎల్లో రంగులో ఉంది.
ఒకవేళ బ్లౌజ్ కుట్టినా కూడా, తర్వాత చీరకి కేప్ లాంటివి ఇచ్చినా కూడా, అందుకు అదనంగా ధర యాడ్ అవుతుంది. ఒకవేళ ఈ చీరకి కేప్ ఇస్తే, 24,975 రూపాయలు అదనంగా యాడ్ అయ్యి, మొత్తం ధర 39,950 అవుతుంది. అయితే సెలబ్రిటీలు అన్నాక సాధారణంగా వారు ధరించేవి కూడా వేలల్లోనే ఖరీదు ఉంటుంది. కానీ ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళేటప్పుడు చీరలు దాదాపు అద్దెకి తీసుకుంటారు. కొద్ది సేపు మాత్రమే ధరించి ఇచ్చేస్తారు.
ALSO READ : బెడిసి కొట్టిన ఐడియా… ఏకంగా కోటి రూపాయలు అడుగుతున్నారా..? అసలు విషయం ఏంటంటే..?