Ads
ఇంట్లో తల్లిదండ్రులు అనేవారికి పిల్లలు ఇచ్చే విలువ వేరే ఉంటుంది. తల్లిదండ్రులని దేవుళ్ళతో సమానంగా చూస్తారు. వాళ్లు మనల్ని పెంచి, పెద్ద చేసి పోషిస్తారు కాబట్టి వారు అంటే ఒక గౌరవం ఉంటుంది. తల్లిదండ్రుల తర్వాత అంత గౌరవించేది కుటుంబంలో ముందు పుట్టిన వారిని. అంటే అక్క, అన్న లాంటివారు. వీళ్లు తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల లాంటివారు అని అంటారు. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఇంట్లో మొదట పుట్టిన వారికి, అంటే పెద్దవారికి, తల్లిదండ్రుల తర్వాత ఆ బాధ్యతలు అందుతాయి.
అది ఆడవారు అయినా సరే, మగవారు అయినా సరే. తల్లిదండ్రుల కష్టాలని కానీ, లేదా తల్లిదండ్రులని కానీ దగ్గరగా చూసిన వాళ్లు పెద్దవాళ్ళు అయ్యి ఉంటారు. సాధారణంగా, ఇంట్లో ముందు పుట్టిన వారు తల్లిదండ్రుల మానసిక ఇబ్బందులను కూడా తీసుకొని ఉంటారు. అంటే తర్వాత పుట్టిన వారికి ఇవన్నీ తెలియవు అని కాదు. కానీ మొదట పుట్టిన వారు విషయంలో జరిగిన పొరపాట్లు కానీ, లేదా అప్పుడు జరిగిన విషయాలు కానీ రెండవ వారి విషయంలో రిపీట్ అవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారు.
తల్లిదండ్రులు కూడా మనుషులే. వారు కూడా పొరపాటు చేస్తారు. మొదటి పిల్లల్ని కనేటప్పుడు, లేదా వారిని పెంచేటప్పుడు అది తల్లిదండ్రులకు కూడా పిల్లల పెంపకం అనేది మొదటి సారి కాబట్టి, వారి విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు. దాని ప్రభావం తెలియకుండా పిల్లల మీద పడుతుంది. దాంతో రెండవ పిల్ల, లేదా పిల్లవాడిని కనేటప్పుడు ఇలాంటివి జరగకూడదు అని తల్లిదండ్రులు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. అంతే కాకుండా, తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలని కూడా మొదటగా పుట్టిన వారు బాగా అర్థం చేసుకుంటారట. ఎందుకంటే వారికి అంత పరిణితి ఉంటుంది.
Ads
ఇంట్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా తప్పులు జరిగినప్పుడు కానీ తల్లిదండ్రులు బాధ పడితే ఆ ప్రభావం మొదటిగా పడేది ఇంట్లో మొట్టమొదట పుట్టిన వారి మీద. దాని వల్ల ఆ పిల్లలు బాధపడతారు. లేకపోతే తల్లిదండ్రులని చూసి ఎలాంటి విషయాలు ఆచరించాలి, ఎలాంటి విషయాలు ఆచరించకూడదు అనే విషయాలని నేర్చుకుంటారు. ఒకవేళ తాను ఏదైనా తప్పు చేస్తే అది తెలియకుండా తన తర్వాత పుట్టిన వాళ్లు కూడా చేసే అవకాశం ఉంటుంది అనే భయం మొదట పుట్టిన వారిలో ఉంటుంది.
చిన్నవారికి బాధ్యతలు పెద్దవారితో పోలిస్తే కాస్త తక్కువగా ఉంటాయి. వారి తర్వాత ఎవరూ ఉండరు కాబట్టి వారికి అదొక రకమైన స్వేచ్ఛ ఉంటుందట. చిన్నవాళ్లు అనే గారాబం కూడా ఉంటుంది. కానీ ఇంట్లో మొదట పుట్టిన వారు మాత్రం తల్లిదండ్రులకి, తర్వాత పుట్టిన వారికి మధ్యలో ఒక లైన్ లాగా ఉంటారట. మానసిక నిపుణులు చేసిన పరిశోధనల ప్రకారం, మొదట పుట్టిన వారు ఎదుర్కొనే సంఘటనలు ఇవే. చాలా ఇళ్లల్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
ALSO READ : 544 స్థానాలకు లోక్‌సభలో 543 సీట్లు..! ఇలా చేయడానికి కారణం ఏంటంటే..?