Ads
సినీ నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. మొదటి భాగం ఈ సంవత్సరం విడుదల చేయాలి అని అనుకుంటున్నారు. మరొక పక్క, హృతిక్ రోషన్ తో వార్ 2 సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నట్టు సమాచారం. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైకి వెళ్లారు. మళ్లీ ఆ తర్వాత దేవర సినిమా షూటింగ్ లో పాల్గొంటారు జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కి మన ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు. సినిమా రంగానికి చెందిన వాళ్లు మాత్రమే కాకుండా ఇతర రంగానికి చెందిన వాళ్లు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి స్నేహితులుగా ఉన్నారు.
Ads
ఈ ఫోటోలో జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న వ్యక్తి, ఇప్పుడు వైసీపీలో ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కొడాలి నాని. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని గతంలో చాలా మంచి స్నేహితులు. ఈ ఫోటో సుబ్బు సినిమా సమయంలో తీసిన ఫోటో. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానితో పాటు, ఈ ఫోటోలో వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా అప్పట్లో చాలా మంచి స్నేహితులు. ఇప్పుడు కూడా ఒకరిపై ఒకరు ఎప్పుడు విమర్శలు చేసుకోలేదు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఒక సమయంలో రాజకీయాల్లో పాల్గొన్నా కూడా, ఇప్పుడు మాత్రం సినిమాల మీదే తన దృష్టి సారించారు. గత కొద్ది సంవత్సరాల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అంతకుముందు తెలుగు దేశం పార్టీ నుండి ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు రాజకీయానికి సంబంధించిన ఏ విషయాలు కూడా బయట మాట్లాడట్లేదు. అలాంటి ప్రశ్నలు ఏమైనా వచ్చినా కూడా, “ఇది సందర్భం కాదు” అని ఆ విషయంపై మాట్లాడట్లేదు. కేవలం సినిమాల గురించి మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ బయట కూడా మాట్లాడుతున్నారు.
ALSO READ : “సరైనోడు”లో ఈ రెండు సీన్లు ఎప్పుడైనా గమనించారా.? ఈ తప్పు ఎలా చేసారో.?