Ads
ఒకప్పుడు హీరోయిన్స్ అనగానే వాళ్ళు సినిమాలో పాటల వరకే పరిమితం అనేట్టుగా ఉండేది. అయితే కాలంతో పాటు మెల్లగా ట్రెండ్ కూడా మారింది. ప్రస్తుతం హీరోతో సమానంగా హీరోయిన్లకు సినిమాలలో పాత్రలను రూపొందిస్తున్నారు. అలా అని చిత్రాల్లో ఉండదు. కొన్ని సినిమాల్లో మాత్రమే.
ఎందుకంటే స్టార్ హీరో మూవీ అంటేనే హీరోయిన్లతో ఎక్కువ పని ఉండదు. వారి సినిమాలలో సాంగ్ వచ్చే కొన్ని క్షణాల లేదా నిముషాల ముందు హీరోయిన్ కనిపిస్తే చాలన్నట్టుగా, ఇక పాటల్లో స్కిన్ షో చేస్తే సరిపోతుంది. హీరోయిన్లకు డాన్స్ చేసే అవకాశం కూడా తక్కువే. ఒకవేళ డాన్స్ వచ్చినా కూడా ఎంతమంది ఆ ఛాన్స్ ని వాడుకుంటారో తెలీదు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే, తాజాగా ‘ధమాకా’ సినిమా విడుదలైంది. ఈ మూవీ రొటీన్ గానే ఉన్నా, శ్రీలీల కోసం అయిన ఒకసారి చూడాలి అనే టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజకు సమానంగా ఆమె మాస్ స్టెప్పులతో ధియేటర్లలో ఈలలు వేయించింది. హీరోయిన్ శ్రీలీల మాత్రమే కాకుండా ఆమెలానే కొంతమంది హీరోయిన్లు కూడా తమ డాన్స్ తో భారతీయ సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపారు. ఆ జాబితాలో తాజాగా శ్రీలీల చేరింది. అయితే ఆ లిస్ట్ లో ఇంతకు ముందున్న హీరోయిన్స్ ఎవరో చూద్దాం..
Ads
1) మాధురి దీక్షిత్ :
ఈ బాలీవుడ్ హీరోయిన్ లిస్ట్ లో నెంబర్ 1 స్థానంలో ఉంది. మాధురి దీక్షిత్ డాన్స్ తో ఆకట్టుకుంది.
2) ఊర్మిళ :
ఊర్మిళ నటించిన ‘రంగీలా’ మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి ప్రధాన కారణం ఆమె చేసిన డాన్స్ అని చెప్పొచ్చు.
3) ఐశ్వర్య రాయ్ :
ఈ ప్రపంచ సుందరి తన అందంతోనే కాకుండా తన డాన్స్ తోను ఆకట్టుకుంది.
4) రాధ :
తెలుగు తెర పై మెగాస్టార్ చిరంజీవితో సమానంగా డాన్స్ చేయయగల హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే వినిపించే పేరు రాధ.
5) శ్రీదేవి :
అతిలోక సుందరి శ్రీదేవి అందంతోనే కాక తన డాన్స్ తో నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఇండియన్ సినిమానే ఊపేసింది.
6) సమీరా రెడ్డి :
సమీరా రెడ్డి కూడా తన డాన్స్ తో ఆకట్టుకుంది.
7) తమన్నా :
తమన్నా డాన్స్ ఎంత బాగా చేస్తుందో ఆడియెన్స్ కి తెలిసిందే. అందానికి డాన్స్ తోడైతే ఎలా ఉంటుందో తమన్నాను చూస్తే అర్దమవుతుంది.
8) శృతి హాసన్ :
హీరోలకు సమానంగా శృతి హాసన్ డాన్స్ చేయగలదు. బెస్ట్ డాన్సర్ అనవచ్చు.
9) సాయి పల్లవి :
సాయి పల్లవి డాన్స్ చేసే పాటలు దాదాపుగా అన్నీకూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండటమే కాకుండా, బిలియన్ వ్యూస్ వస్తుంటాయి.
10) శ్రీలీల :
శ్రీలీల అందంలోనే కాదు అద్భుతంగా డాన్స్ కూడా చేయగలదని ధమాకా సినిమాతో తెలిసింది.
Also Read: మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్లాప్ టాక్ తెచ్చుకొని, ఆ తరువాత హిట్ అయిన 8 చిత్రాలు ఇవే..