Ads
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది డైరెక్టర్లు, కొంత మంది హీరోలు తమ సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉండాలి అని అనుకుంటారు. సమాజానికి ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటారు. ఇలా అనుకున్న వారిలో డైరెక్టర్లు ఉన్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి శంకర్. శంకర్ తన మొదటి సినిమా నుండి కూడా ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. రోబో సినిమాతో కూడా అలాగే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నించారు.
యంత్రాలు అనేవి కేవలం ఒక లిమిట్ వరకు మాత్రమే వాడాలి అని, వాటికి ఎమోషన్స్ పెట్టడానికి ప్రయత్నిస్తే అవి మనకే అడ్డు తిరిగే అవకాశం ఉంది అని ఈ సినిమా ద్వారా చెప్పారు. ఈ సినిమాకి కొనసాగింపుగా వచ్చిన సినిమా రోబో 2.0. ఈ సినిమాలో కూడా శంకర్ చాలా మంచి మెసేజ్ చెప్పారు. కానీ ఈ విషయాన్ని ఎక్కువ మంది పట్టించుకోలేదు. విలన్ పాత్రని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అసలు మెసేజ్ ఇచ్చింది విలన్ పాత్ర.
Ads
ఈ సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన పక్షిరాజా పాత్ర సెల్ ఫోన్ టవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల పక్షులకి ఆశ్రయాలు తక్కువగా అయిపోయి, అంతరించిపోతున్నాయి అని చెప్పారు. తాను బతికున్నంత వరకు కూడా పక్షుల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. కానీ తర్వాత పక్షులు అంతరించిపోవడంతో ఆయన కూడా బాధపడతారు. ఇదే విషయాన్ని ఈ సినిమా ద్వారా చెప్పడానికి ప్రయత్నించారు.
ఈ ప్రయత్నంలోనే పక్షిరాజా కొన్ని పనులు చేస్తారు. దాని వల్ల జనాలకి ఇబ్బంది కలుగుతుంది. చివరిలో రజనీకాంత్ పోషించిన వశీకర్ పాత్ర మాట్లాడుతూ, పక్షిరాజా చెప్పింది కరెక్ట్ అని అంటారు. కానీ ఈ విషయాన్ని నిజంగానే ఎవరూ పట్టించుకోలేదు. పక్షిరాజాని కేవలం విలన్ లాగా మాత్రమే చూశారు కానీ, ఆయన చెప్పిన విషయాన్ని ఎవరు ఆలోచించలేదు. ఒకవేళ అలా ఆలోచిస్తే వశీకర్ తో పాటు పక్షిరాజా కూడా హీరోనే అవుతారు. ఈ సినిమాతో శంకర్ ఇంత మంచి మెసేజ్ ఇచ్చారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని అర్థం చేసుకున్నారు.