Ads
రైళ్లకి సంబంధించి మనకి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి విషయాలు ఉన్నాయి. చాలామంది కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని అనుకుంటుంటారు. మీరు కూడా అలానే కొత్త విషయాలను తెలుసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఇది కూడా మీరు తెలుసుకుని తీరాలి. రైలు ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. దూరదూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా ఈజీగా ఉంటుంది. కూర్చోవడానికి నిద్రపోవడానికి కూడా బాగుంటుంది.
టికెట్లను కూడా మనం ఈజీగా తీసుకోవచ్చు. అయితే మనం ట్రైన్ లో వెళ్తున్నప్పుడు పక్కన బోర్డులు కనపడుతూ ఉంటాయి. కిటికీ నుండి బయటకి చూస్తే ఈ బోర్డులు మనకి కనబడుతూ ఉంటాయి.
ఆ బోర్డు మీద కొన్ని కొన్ని సింబల్స్ ఉంటాయి. W/L అని బోర్డు మీద కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎందుకు ఇలా బోర్డు మీద రాస్తారు అని అనుకున్నారా..? ఆ విషయమే ఈరోజు చూద్దాం. W/L బోర్డు రైల్వే ట్రాక్ కి రెండు పక్కలా ఉంటుంది. ట్రాకుల మీద ఈ బోర్డులను ఎందుకు పెడతారు అంటే… రైలు నడిపే లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండాలని.
Ads
లోకో పైలట్లు అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తగా నడపాలని ఈ బోర్డులని ఏర్పాటు చేస్తుంది. రైల్వే శాఖ క్రాసింగ్ కి రెండు పక్కలా కూడా ఈ బోర్డులని పెడతారు. దీనిని దాటడానికి 600 మీటర్ల ముందే బోర్డు ఉంటుంది దీని మీద నుండి రైల్వే పైలెట్ వెళుతున్నప్పుడు హార్న్ ఇవ్వాలి.
ఆ బోర్డు దాటే వరకు హార్న్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకు హారన్ ఇవ్వాలంటే… క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అటువంటి ప్రమాదాలు జరగకూడదని హార్న్ ఇవ్వాలి. పసుపు రంగు బోర్డు మీద W/L ఉంటుంది పసుపు రంగును ఉపయోగించడం వల్ల క్లియర్ గా లోకో పైలెట్ కి కనబడుతుంది. దూరం నుండి కూడా లోకో పైలెట్లుకి క్లియర్ గా కనబడుతుంది కాబట్టి అలెర్ట్ అవుతారు. ఈ బోర్డులను ఏర్పాటు చేయడానికి రైల్వే శాఖ కొన్ని రూల్స్ ని కూడా పెడుతుంది. నేల నుండి ఈ బోర్డు 2100 మిల్లి మీటర్ల ఎత్తులో ఉండాలి. అలానే ఓ బోర్డు ఇంగ్లీష్ లో ఉంటే ఇంకొకటి హిందీలో ఉండాలి ఇలా కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి.