Ads
అబ్బాస్ ‘ప్రేమదేశం’ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు. అప్పట్లో తెలుగు, తమిళ పరిశ్రమల్లో చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. లవర్ బాయ్‌గా అమ్మాయిల మనసులో నిలిచిన హీరోల్లో అబ్బాస్ కూడా ఒకరు.
Ads
ఆయనకు వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ సోలో హీరోగా చేసిన చిత్రాలు అంతగా విజయం కాకపోవడంతో, సెకండ్ హీరోగా చేశాడు. దానివల్ల అబ్బాస్ అగ్ర హీరోగా మారలేకపోయాడు. కానీ అబ్బాస్ అమ్మాయిల కలల రాజకుమారుడిగా మాత్రం బాగా పాపులర్ అయ్యాడు. ఇక అబ్బాస్ హెయిర్ స్టైల్ కు ఎంతో మంది అభిమానులు ఉండేవారు. సెలూన్ కు వెళ్లి అబ్బాస్ హెయిర్ స్టైల్ అనగానే చేసేవారు. అంతగా పాపులర్ అయిన నటుడు.
అబ్బాస్ తెలుగులో కృష్ణబాబు, రాజా, ప్రియా ఓ ప్రియా వంటి చిత్రాల్లో నటించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించాడు. హీరో నితిన్ నటించిన ‘మారో’ సినిమాలో విలన్ గా నటించాడు. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరంగా వెళ్ళిపోయాడు.ప్రస్తుతం అబ్బాస్ విదేశాల్లో స్థిరపడ్డాడు. అక్కడ ఆయన మోటివేషనల్ స్పీకర్ గా జాబ్ చేస్తున్నాడు. అబ్బాస్ ఇకపై సినిమాలలో నటించనని ఒక సందర్బంలో చెప్పాడు. అయితే అబ్బాస్ కుటుంబం గురించి చాలా మందికి తెలియదు. హీరో అబ్బాస్ భార్య కూడా సినిపరిశ్రమకి చెందిన అమ్మాయే. ఆమె పేరు ఇరుము అలీ. ఆమె చాలా సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించిందంట. ఎక్కువగా బాలీవుడ్ సినిమాలలో హీరోయిన్ గా చేసింది. ఆమె అబ్బాస్ ను పెళ్లిచేసుకున్న తర్వాత ఆయనతో కలిసి న్యూజిలాండ్ లోనే స్థిరపడ్డారు.
ఇక అబ్బాస్ కు కొడుకు అయిమాన్, కూతురు ఏమిరా అలీ.తాజాగా అబ్బాస్ ఆయన భార్యా పిల్లలు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అబ్బాస్ లాగానే, ఆయన భార్యా పిల్లలు కూడా చాలా అందంగా ఉంటారు. ఇక అబ్బాస్ కూతురు ఏమిరా అలీ హీరోయిన్స్ కు తీసిపోని అందంగా ఉంది.ఆమె ఫోటోలు చూసినవారు ఎంత బాగుంది. ఏమిరా అందం ముందు హీరోయిన్స్ కూడా నిలవలేరని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: నిజ జీవితంలో పార్ట్‌నర్స్‌గా మారిన 10 మంది హీరోహీరోయిన్లు ఎవరంటే..!