Ads
ఎస్పీజీ కమాండోలు రక్షణగా వుంటారు. కేవలం ఒక్క ప్రధాని కి రక్షణ ఇవ్వడమే కాక ఆయన ఇల్లు, కుటుంబ సభ్యులకు కూడా రక్షణ ని కల్పిస్తారు. చాలా మందికి ఎస్‌పీజీ కమాండోలు కి సంబంధించి సందేహాలు ఉంటూ ఉంటాయి. మీకు కూడా అసలు ఎస్‌పీజీ కమాండోలు ని ఎలా తీసుకుంటారు..? వాళ్లకి ఎంత సాలరీ ఇస్తారు అనే సందేహాలు ఉన్నాయా..? అయితే తప్పక మీరు దీన్ని చూడవలసిందే. ఎస్‌పీజీ కమాండోలు కి ఎప్పుడు ఇదే డ్యూటీ ఉండదు. వీళ్ళ పోస్టులలో మార్పులు చేస్తూ వుంటారు.
ప్రధాన మంత్రికి రక్షణ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు ఎవరు దాడి చేస్తారు అనేది మనకి తెలియదు. రిస్కుతో కూడిన పని కాబట్టి ఖచ్చితంగా వాళ్లకి సెక్యూరిటీ ఉండాలి.
అప్పట్లో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉండే సమయంలో ఆమె భద్రతాధికారులు ఆమెని కాల్చి చంపేశారు. ఈ కారణంగా అప్పటి నుండి ప్రధాని భద్రతా బాధ్యతలను ఎస్పీజీ ఏ చూసుకుంటోంది. ఇదివరకు ఎస్పీజీని ఏర్పాటు చేయలేదు. కేవలం ఇందిరాగాంధీ చనిపోయినప్పటి నుండి మాత్రమే ఈ మార్పును తీసుకొచ్చారు. అయితే ఎవరు ఇలా పని చేస్తారు..?
Ads
ఏదైనా రిక్రూట్మెంట్ ఉంటుందా అనేది చూస్తే.. దీనికోసం స్పెషల్ గా రిక్రూట్మెంట్ అనేది ఉండదు. ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి చెందిన ఆఫీసర్స్ ఉంటారు ఇందులో నుండే ఎస్‌పీజీలని తీసుకోవడం జరుగుతుంది వీళ్ళకి శిక్షణ ఇచ్చి తర్వాత బాధ్యత అప్పగిస్తారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే 3000 మందికి పైగా ఎస్పీజీ లో ఉన్నారు. అయితే ఎస్పీజీలో శాశ్వతంగా పని చేయరు.
వీళ్ళు సంవత్సరం మాత్రమే పని చేస్తారు ఆ తర్వాత వీళ్ళకి మరొక బాధ్యత అప్పగిస్తారు. వేరే పోస్ట్ ఉంటుంది. ఇందులో పనిచేయడం అంటే ప్రధానికి రక్షణ కల్పించడం. అందుకని మెరుగైన కమాండోలనే ఎంపిక చేస్తారు ఏదైనా ప్రమాదం రాబోతున్న వచ్చినా త్వరగా సిద్ధంగా ఉండాలి ప్రతిక్షణం కూడా అలర్ట్ గా ఉండాలి. ఇక వీళ్ళ జీతం విషయానికి వస్తే.. నెలకు రూ.84వేల నుంచి రూ.2.50 లక్షల దాకా ఇస్తారు. డ్రెస్ అలవెన్స్ గా ఏడాదికి రూ.27,800 ఇస్తారు. బోనస్లు, ఇతర అలోవెన్సులు కూడా ఉంటాయి.