Ads
Waltair veerayya Review in Telugu:
నటులు: మెగాస్టార్ చిరంజీవి, రవి తేజ, శృతిహాసన్, కేథరిన్ థెరెసా, బాబీ సింహా, సత్య రాజ్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి తదితరులు
దర్శకుడు: బాబీ కొల్లి
నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
రిలీజ్ డేట్: జనవరి 13,2023
Waltair veerayya Review: చిరంజీవిని పక్కా మాస్ లుక్ లో కనపడనున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవి తేజ, శృతిహాసన్, కేథరిన్ థెరెసా, బాబీ సింహా, సత్య రాజ్, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, శ్రీనివాస రెడ్డి తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కేథరిన్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమా వచ్చింది.
కథ:వైజాగ్ లోని వాల్తేరులోని జాలర్ల పేటలో నివసించే వాల్తేరు వీరయ్య(మెగాస్టార్ చిరంజీవి) చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేస్తూ, ఆ పేట మొత్తానికి బాస్ లా ఉంటాడు. డ్రగ్ మాఫియా లీడర్ సోలోమన్ (బాబీసింహా)ను పట్టుకోవడంలో సహాయం చేయమని ఎంత డబ్బు అయిన ఇస్తానని వీరయ్యతో డీల్ సెట్ చేసుకుంటాడు ఇన్స్పెక్టర్ సీతాపతి (రాజేంద్రప్రసాద్). సోలోమన్ పట్టుకోవడం కోసం వీరయ్య మలేసియా వెళతాడు. ఆ క్రమంలో అదితి(శృతి హాసన్)తో ప్రేమలో పడతాడు.
అయితే తాను వెళ్ళింది సోలోమన్ పట్టుకోవడం కోసం కాదని, అతని అన్నయ్య మైఖేల్(ప్రకాష్ రాజ్) పట్టుకోవడం కోసమని చెప్పి సీతాపతి షాక్ అయ్యేలా చేస్తాడు. మలేషియాలో డ్రగ్స్ బిజినెస్ చేసే మైఖేల్ కు వైజాగ్ లో జాలరి పేటలో ఉండే వీరయ్యకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అసలు వీరయ్యకు ఎవరూ లేరా? ఈ స్టోరీలో అసిస్టెంట్ కమిషనర్ విక్రమ్ సాగర్ (రవితేజ) పాత్ర ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు: మెగాస్టార్ చిరంజీవి లుక్స్, ఆయన మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటాయి. ఆయన పాత్ర ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సినిమా మొత్తం కామిక్ వేలో పాత్ర సాగుతూ ఉంటుంది.మాస్ మహరాజ రవితేజ పోలీసు ఆఫీసర్ గా తెలంగాణ యాసతో అలరించాడు. శృతిహాసన్ రా ఆఫీసర్ గా ఆకట్టుకుంది. బాబీ సింహా, ప్రకాష్ రాజ్, శ్రీనివాసరెడ్డి,ప్రదీప్ రావత్, రాజేంద్రప్రసాద్, షకలక శంకర్, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఊర్వశి రౌతేలా డాన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్, ఇంట్రడక్షన్, ఇంటర్వెల్ బ్లాక్ ను తీర్చిదిద్దిన తీరు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తాయనే చెప్పాలి.
సాంకేతికవర్గం పనితీరు: డైరెక్టర్ బాబీ కొల్లి రివెంజ్ స్టోరీని, స్క్రీన్ ప్లేతో అలరించే విధంగా తీశాడు. దాంతో సినిమా బోర్ కొట్టకుండా సాగుతుంది. దర్శకుడిగా బాబీ ఓవరాల్ గా ఇటు మాస్ ఆడియన్స్, అటు మెగా ఫ్యాన్స్ ను అలరించడాని చెప్పాలి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించింది.ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ ఈ మూవీకి ప్లస్ గా మారింది. మెగాస్టార్ ఇంట్రడక్షన్ మరియు ఇంటర్వెల్ సీన్స్ లో క్లోజప్ షాట్స్ & ఫ్రేమ్స్ బాగున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ బాగుంది. “పూనకాలు లోడింగ్” సాంగ్ కు కంపోజ్ చేసిన తీరు ఆడియన్స్ కు పునకాలు తెప్పిస్తాయి.
ప్లస్ పాయింట్స్:
చిరంజీవి నటన, డాన్సులు, కామెడీ టైమింగ్,
రవితేజ పెర్ఫామెన్స్,
సాంగ్స్, బీజీఎం,
చిరంజీవి ఎలివేషన్ సీన్లు,
ఫస్టాఫ్
Ads
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ,
కథనంలో కొంత ల్యాగ్,
సెకండాఫ్ లోని కొన్ని సన్నివేశాలు,
రొటీన్ క్లైమాక్స్
రేటింగ్ : 2.75/5
Also Read: వీరసింహారెడ్డి మూవీ రివ్యూ.. బాలయ్య ఫ్యాన్స్ కు పండగ