రావు గోపాలరావు మరణించిన సమయంలో ఒక్క హీరో కూడా వెళ్ళకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

Ads

రావు గోపాల్ రావు గురించి టాలీవుడ్ ఆడియెన్స్ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సరికొత్త విలనిజాన్ని తెలుగు సినిపరిశ్రమకి పరిచయడమే కాకుండా విలన్ క్యారెక్టర్ కే వన్నె తెచ్చినటువంటి విలక్షణ నటుడు. ముత్యాల ముగ్గు చిత్రంలో చేసిన పాత్ర ద్వారా రావు గోపాలరావుకు నటుడిగా మంచి పేరు వచ్చింది. ఆ సినిమాలో తనదైన డైలాగ్ మాడ్యులేషన్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు.

Ads

రావు గోపాలరావు 1937 లో ఆంధ్రప్రదేశ్ లోని గంగనపల్లి గ్రామంలో జన్మించారు. ఆయనకు చిన్నతనం నుండి నాటకాలపై ఆసక్తి ఉండేది. అందువల్ల ఆయన మొదట రంగస్థల నటుడిగా తన కెరీర్ ను మొదలుపెట్టారు. ఆ తరువాత సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయన మొదట్లో చిన్న చిన్న పాత్రలో నటించేవారు. ఆ తరువాత క్రాంతి కుమార్ ‘శారద’ చిత్రంలో రావు గోపాల్ రావు చేసిన పాత్రతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఈ గుర్తింపుతో ఆయనకు బాపు దర్శకత్వంలో నటించే అవకాశం లభించింది. ఆ సినిమానే ‘ముత్యాలముగ్గు’. ఇక ఈ చిత్రం తరువాత రావు గోపాలరావు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముత్యాలముగ్గు సినిమా తరువాత రావు గోపాలరావు దశ తిరిగిపోయింది. అప్పటి నుండి వచ్చిన రావు గోపాలరావు పాత్ర లేకుండా ఏ చిత్రం వచ్చేది కాదు. ఆయనకు అంతగా డిమాండ్ పెరిగిపోయింది. ఇలా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు పొందుతూ ఆయన ఆర్థికంగా బాగా ఎదిగారు.
కానీ ముందుచూపు లేని కారణంగా, అందరిని నమ్మి డబ్బులు మొత్తం కోల్పోయారు. అలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రావుగోపాలరావు అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆ సమయంలో చికిత్సకు కూడా డబ్బులు లేకపవడంతో ఉన్న కొంచెం డబ్బును ఆయన చికిత్సకు ఖర్చు పెట్టేసారు. 1994 ఆగస్టు 13న రావు గోపాలరావు కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలకు సిని పరిశ్రమలో స్టార్ హీరోలు, పెద్ద దర్శకులు, నిర్మాతలు ఉన్నా ఎవ్వరూ ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వెళ్లలేదు. అంటే ఆయన ఎంత దయనీయ పరిస్థితుల్లో చనిపోయారో అర్థం చేసుకోవచ్చు.
అయితే అప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. ఇక రావు గోపాలరావు అంత్యక్రియలు చెన్నైలో జరగడం వల్ల సినీ ప్రముఖులు వెళ్లలేకపోయారనే తెలుస్తోంది. ఇక ఈయన వారసుడిగా రావు రమేష్ సైతం ప్రస్తుతం ఆఫర్లను అందిపుచ్చుకుంటూ నటుడిగా కొనసాగుతున్నారు.

Also Read: “గోదావరి” సినిమా ముద్దుగుమ్మ “కమిలినీ ముఖర్జీ” గుర్తుందా ? ఇప్పుడెలా మారిపోయిందంటే ?

Previous articleఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? మహేష్ బాబుతో కూడా నటించింది.!
Next articleDunki Review : “షారుఖ్ ఖాన్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.