Ads
తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. దర్శక ధీరుడు రాజమౌళి తీసే ప్రతి చిత్రంలోనూ కనిపిస్తుంటాడు. ఆ నటుడి పేరు చంద్రశేఖర్. ఆయన ఎన్నో సంవత్సరాలుగా టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.
Ads
గత ఏడాది విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోను కీలక పాత్రలో నటించాడు. ఇక ఆర్టిస్టుగా ‘చత్రపతి’ చిత్రం చంద్రశేఖర్ కు మంచి గుర్తింపును ఇచ్చింది. ఈ సినిమాతోనే హీరో ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారాడు. చత్రపతి నుండి చంద్రశేఖర్ నటుడుగా వందలాది చిత్రాల్లో నటించి అలరించాడు. ఈ సినిమా కన్నా ముందు స్టూడెంట్ నెంబర్ వన్, సై, సింహాద్రి, సినిమాలలో నటించాడు. కానీ చంద్రశేఖర్ కు నటుడిగా గుర్తింపును ఇచ్చిన సినిమా ఛత్రపతి కావడంతో అప్పటినుండి ఆయనను అందరు ఛత్రపతి చంద్రశేఖర్ అంటున్నారని తెలుస్తోంది.
అయితే చంద్రశేఖర్ గురించి సినిమాల పరంగా అందరికి తెలుసు. కానీ అతని వ్యక్తిగత విషయాలు ఎక్కువగా ఎవరికి తెలియవనే చెప్పాలి. ఆయన భార్య కూడా తెలుగు ఇండస్ట్రీ నటి అని చాలామందికి తెలియదు. చంద్రశేఖర్ సతీమణి పేరు నిలియా భవాని. ఆమె తెలుగులో కిక్ 2,నాని జెంటిల్ మ్యాన్,సైరా నరసింహారెడ్డి, పండగ చేసుకో లాంటి చాలా చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి ఆకట్టుకుంది. అయితే ఆమె తెలుగులోనే కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా అజిత్, విజయ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అక్కడ మంచి పేరు, గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం భవాని బుల్లితెర సీరియల్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తోంది.
నీలియ భవాని ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగింది. చంద్రశేఖర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. అయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకునే నాటికి చంద్రశేఖర్ ఇంకా ఇండస్ట్రీలో అడుగు పెట్టలేదు. అప్పటికి ఆయనకి ఉద్యోగం కూడా లేదు.దాంతో భవాని పేరెంట్స్ వీళ్లిద్దరీ పెళ్లికి అంగీకరించలేదు. దాంతో ఇద్దరు హైదరాబాద్ కి వచ్చి వివాహం చేసుకున్నారు. అనంతరం చంద్రశేఖర్ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా ఆ సమయంలో రాజమౌళి ‘శాంతి నివాసం’ సీరియల్ లో చిన్న పాత్రలో నటించే అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత రాజమౌళి సినిమాలు చేయడం, అందులో చంద్రశేఖర్ కి అవకాశాలు ఇవ్వడంతో సినిమాలలో బిజీ అయ్యాడు.
ఆయన భార్య భవాని కూడా సినీ రంగంలోకి వచ్చి, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఇంత మంచిగా ఉన్న వీరు దాంపత్య జీవితంలో వచ్చిన మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప. వీళ్ళిద్దరూ ప్రస్తుతం భవానితోనే ఉంటున్నారని తెలుస్తోంది. ఇక వీరి కూతురు పేరు పూజిత. ఆమె అపోలో మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతోంది. కొడుకు పేరు మహేశ్వరన్. అతను క్రికెటర్ గా స్థిరపడడం కోసం ప్రయత్నిస్తున్నాడు.
Also Read: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.. మెగా మాస్ పూనకాలు లోడింగ్..