Ads
తెలుగు సినీపరిశ్రమలో నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె 1989లో రిలీజ్ అయిన ‘చిన్నారి స్నేహం’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాతో ఆమె ఉత్తమ హాస్య నటి అవార్డును అందుకున్నారు.
Ads
హేమ తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా నటించింది. మొత్తం కలిపి ఇప్పటి వరకు 400కి పైగా చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం నటిగా కొనసాగుతోంది. తెలుగు సినీపరిశ్రమలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా 1989లో హేమ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న సీనియర్ నటీమణులలో హేమకు ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పచ్చు. హేమ అసలు పేరు కృష్ణ వేణి. ఇండస్ట్రీలోకి వచ్చాక హేమగా పేరు మార్చుకున్నారు.1967లో తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు గ్రామంలో హేమ జన్మించారు. ఆమెకి నటన అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు చిత్రాలలో ముఖ్యంగా బ్రహ్మానందకు జంటగా అమాయకమైన భార్య క్యారెక్టర్ ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. చాలా సినిమాలలో హేమ సపోర్టింగ్ పాత్రలలో నటించి టాలీవుడ్ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 54 ఏళ్ళు. ఆమెకు పెళ్లి వయసు ఉన్న ఒక కూతురు ఉంది. అయినా కూడా ఆమెను ఆంటీ అని ఎవరైనా పిలిస్తే ఇబ్బందిగా అనిపిస్తుందంట. ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది సమయంలోనే దాదాపు 400 సినిమాలకు పైగా నటించింది. కెరీర్ పరంగా హేమ సినీరంగంలో నిలదొక్కుకోవడానికి ముఖ్య కారణం, ఆమెను ఎంతగానో ప్రోత్సహిస్తున్న తన భర్త అని చెప్పవచ్చు. హేమా భర్త కూడా సినీ రంగానికి చెందిన వ్యక్తి. ఆమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్, ప్రముఖ కెమెరామెన్ గా టాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.
Also Read: ఎన్టీఆర్, బాలకృష్ణ అప్పట్లోనే బాహుబలి వంటి మూవీలో నటించారు.. అయితే ఆ మూవీ ఎందుకు రిలీజ్ కాలేదో తెలుసా?