Ads
ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ ఎవరు అంటే తడుముకోకుండా చెప్పే ఒకే పేరు రాజమౌళి. ఆయన ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా విజయం సాధించింది. అపజయం ఎరుగని దర్శకుడుగా, బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చి జక్కన్న స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు. రాజమౌళి బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ కి తెలుగు సినిమాను, తెలుగు హీరోలను తీసుకెళ్లారు.
Ads
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమా సత్తాని అంతర్జాతీయంగా చాటాడు రాజమౌళి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ నాటు నాటు పాటకు గాను వచ్చింది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్ బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళికి, అలాగే నాటు నాటు పాటకు అవార్డ్స్ వచ్చాయి. అంతేకాకుండా ఆస్కార్ కి షార్ట్ లిస్ట్ అయ్యింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి అవార్డ్ వచ్చిన నేపధ్యంలో రాజమౌళి తండ్రి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. వాటిలో ఆయన భార్య గురించి, అలాగే ఆమెకి మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలికి ఉన్న నేపధ్యం గురించి కూడా విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజమౌళి లాగానే ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. ఆయన కమ్మ అని, నా భార్య రాజనందిని కాపు వర్గానికి చెందిన వారని తెలిపారు. అయితే ఈ సంగతి పెళ్ళైన చాలా కాలం వరకు ఆయనకి తెలియదంట.మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ’ మూవీ చూడడానికి వెళ్ళిన సమయంలో మ ఆవిడ మా చిరంజీవి అదరగొట్టేసాడు అంటూ ఆనందపడడంతో, చిరంజీవి మీకు ఏమైనా బంధువు అవుతాడా అని అడిగారట విజయేంద్ర ప్రసాద్. దానికి ఆమె చిరంజీవి కూడా మా వాళ్ళే అని చెప్పిందంట. ఆయనకి అప్పుడు తెలిసిందంట. తన భార్య కాపు వర్గానికి చెందిన ఆమె అని, ఆవిడ చిరంజీవికి పెద్ద అభిమాని అని, అయితే తన ఫ్యామిలిలో చాలా మంది ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకున్నారని, అది కూడా కులాంతర వివాహం అని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
Also Read: మగధీర సినిమాలో ఈ సన్నివేశం చూసినప్పుడు మీకు ఇదే సందేహం వచ్చిందా..?