Ads
తెలుగు సినీ పరిశ్రమలో తమకంటూ ఒక క్యారెక్టర్ సరైన సమయంలో అది కూడా సరైన స్టోరీతో వచ్చినపుడు అద్భుతాలు సృష్టించగల యాక్టర్స్ చాలా మండి ఉన్నారు. అటువంటి వారిలో నటుడు బెనర్జీ తొలి వరుసలో ఉంటారు.
Ads
ఈ మద్యకాలంలో విడుదల అయిన విరాటపర్వం చిత్రంలో ముఖ్య మైన క్యారెక్టర్ లో నటించి మూవీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా అయ్యారు. ఇక టాలీవుడ్ లో వచ్చే ఏ పెద్ద సినిమా అయిన సరే అందులో ఒక క్యారెక్టర్ బెనర్జీకి ఉంటుందని చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల నుండి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు కూడా బెనర్జీకి రావాల్సినంత పేరు అయితే రాలేదనే చెప్పవచ్చు. టాలీవుడ్ లో ఎంతోమంది ప్రతిభ కలిగిన నటులు ఉన్నా కూడా, బెనర్జీ గొప్ప నటుడు.
ఇక నటుడు బెనర్జీ గురించి అందరికి తెలిసిందే. ఆయన అనుకోకుండానే చిత్రపరిశ్రమలో అడుగు పెట్టారు. ఆయనది నలబై సంవత్సరాల సినీ ప్రస్థానం. బెనర్జీది ముక్కుసూటి మాట్లాడే మనస్తత్వం, నటుడిగా కెరీర్ లో ఒడిదుడుకులు వచ్చినా, వెనుదిరిగి చూడని యాక్టర్ బెనర్జీ. ఆయన నటుడు మాత్రమే కాదు. నిర్మాతగా , దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన విలన్ గా మాత్రమే కాకుండా ఏ క్యారెక్టర్ చేసిన కూడా అందులో ఒదిగిపోయేవాడు.
మా ఎలక్షన్స్ లోనూ బెనర్జీ అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం అందరికి తెలిసిందే. కానీ బెనర్జీ కుటుంబం గురించి కానీ ఆయన బ్యాక్ గ్రౌండ్ గురించి చాలా మందికి తెలియదు. ఇక యాక్టర్ బెనర్జీ తండ్రి మరెవరో కాదు యాక్టర్ రాఘవయ్య. ఆయన నటుడుగా యాబై ఏళ్లు ఇండస్ట్రీలో కొనసాగారు. బెనర్జీ తన తండ్రి నట వారసత్వాన్ని అందుకుని సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. బెనర్జీ నటుడుగా ఎదిగిన తీరు అందరికీ తెలుసు. ఆయన 1982లో హరిశ్చంద్రుడు అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చి, దాదాపు 150 చిత్రాలలో నటించాడు.
Also Read: హీరో శర్వానంద్ వివాహం చేసుకోబోయే రక్షిత రెడ్డి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?