Ads
కొందరికి ఇంట్లో అసలు పేరు కాకుండా ఇంట్లోవారు ముద్దుగా పిలిచే పేర్లు ఉంటాయి. కొంతమందికి కాలేజీలో ఫ్రెండ్స్ పెట్టే నిక్ నేమ్స్ ఉంటాయి. ఇక సినిమా యాక్టర్స్ కి అయితే వారి పేరు ముందుగా ఇచ్చిన బిరుదులు ఉంటాయి.
అయితే కొంతమందికి మూవీ పేర్లు కూడా ఉంటాయి. అవి వారు సినిమాలో చేసిన క్యారెక్టర్స్ పేర్లు కాదు. ఆ సినిమా పేరునే వారి ఇంటి పేరుగా పెట్టుకున్నవటు తెలుగుఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్నారు. మరి అలా సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. షావుకారు జానకి:
1949లో అలనాటి నటి జానకి షావుకారు అనే చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాలో జానకి చేసిన సుబ్బులు క్యారెక్టర్ ఆడియెన్స్ కి బాగా నచ్చింది. ఇక ఆరోజు నుండి ఆమెను అందరు షావుకారు జానకి అని పిలుస్తారు.2.సాక్షి రంగారావు:
ఈ నటుడు పూర్తి పేరు రంగవఝుల రంగారావు. ఆయన నటించిన తొలి చిత్రం బాపూ-రమణల తెరకెక్కించిన సాక్షి. 1967లో ఈ మూవీ విడుదల అయ్యింది. ఇక అప్పటి నుండి సాక్షి ఆయన ఇంటిపేరుగా మారింది.
3.ఆహుతి ప్రసాద్:
ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. ఇండస్ట్రీలోకి వచ్చాక రెండు చిత్రాల్లో నటించారు. అయితే ఆహుతి అనే సినిమాతో గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి ఆయన పేరు ఆహుతి ప్రసాద్ గా మారింది.4.శుభలేఖ సుధాకర్:
మెగాస్టార్ చిరంజీవి నటించిన శుభలేఖ సినిమాలో ఈ నటుడు మొదటిసారి నటించారు. ఆ చిత్రం విజయం పొందడంతో ఆయన పేరు శుభలేఖ సుధాకర్ గా మారింది.
5.చిత్రం శ్రీను:
ఈ హస్య నటుడి అసలు పేరు శ్రీనివాసులు. డైరెక్టర్ తేజ మొదటి సినిమా ‘చిత్రం’ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ సినిమా హిట్ అవ్వడంతో అతని పేరు చిత్రం శ్రీనుగా మారింది.
6 .అల్లరి నరేష్:
దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ రెండవ కొడుకు నరేష్, తన తొలి చిత్రం పేరు ‘అల్లరి’. ఆ మూవీ హిట్ అవ్వడంతో ఆయన పేరు అల్లరి నరేష్ గా మారిపోయింది.7.సత్యం రాజేష్:
రాజేష్ బాబు అనే హాస్య నటుడు సత్యం మూవీకి ముందు కొన్ని చిత్రాల్లో నటించారు. సత్యం మూవీతో గుర్తింపు లభించడంతో ఆయన పేరు సత్యం రాజేష్ గా మారింది.
Ads
8.వెన్నెల కిషోర్:
ఈ హాస్యనటుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన బొక్కల కిషోర్ కుమార్. వెన్నెల అనే సినిమాలో నటించి,గుర్తింపు రావడంతో వెన్నెల కిషోర్ గా మారిపోయారు.9.కిక్ శ్యామ్:
కోలీవుడ్ యాక్టర్ శ్యామ్ సుధీమ్ ఇబ్రహీం రవితేజ హీరోగా వచ్చిన కిక్ మూవీలో నటించాడు. అందులో ఆయన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో కిక్ శ్యామ్ గా మారిపోయారు.
10.ఠాగూర్ మధు:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాని బి.మధు నిర్మించారు. ఈ మూవీ హిట్ అవడంతో ఠాగూర్ మధుగా పేరు మారింది.
11.దిల్ రాజు:
ఈ నిర్మాత అసలు పేరు వి.వెంకట రమణా రెడ్డి. ఆయన డిస్ట్రిబ్యూటర్ కెరీర్ ను మొదలు పెట్టి, శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి దిల్ అనే చిత్రాన్ని తీశారు. అది విజయం పొందడంతో ఆయన పేరు దిల్ రాజు గా మారింది.
Also Read: త్రివిక్రమ్ దర్శకుడిగా మారకముందు ఏం చేసేవారో తెలుసా..!