Ads
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఎన్టీ రామరావుగారి వారసుడిగా సినిపరిశ్రమకు పరిచయం అయ్యారు. బాలకృష్ణ 14 సంవత్సరాల వయసులోనే 1974లో తాతమ్మ కల సినిమాతో బాల నటుడిగా తెరంగేట్రం చేశారు.
Ads
ఆ తరువాత చాలా సినిమాలలో తన తండ్రితో కలిసి నటించారు. అయితే 1984లో వచ్చిన మంగమ్మగారి మనవడు మూవీతో సూపర్ హిట్ అందుకొని సోలో హీరోగా మారాడు. ఇక అప్పటి నుండి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఆ సినిమా తరువాత వరుసగా సినిమాలు చేస్తూ లారీ డ్రైవర్, ముద్దుల మావయ్య, కథానాయకుడు, ఆదిత్య 369 లాంటి ఎన్నో హిట్ లు అందుకొని టాలీవుడ్ లో మూడో తరం నటులలో టాప్ 4 స్టార్ హీరోలలో ఒకరిగా ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.
బాలకృష్ణకు తెలుగు ఆడియెన్స్ లో ఉండే క్రేజ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలకు రికార్డ్ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది. తన కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న బాలకృష్ణ ప్రస్తుతం ఒకవైపు సినిమాలో నటిస్తూ, ఇంకోవైపు ఎమ్మెల్యే గా రాజకీయాలలోనూ బిజీగా ఉన్నారు. గత ఏడాది ఆహా ఓటీటీలో ప్రసారం అయిన అన్ స్టపబుల్ టాక్ షోతో హోస్ట్ గా కొత్త అవతారం ఎత్తాడు బాలయ్య. అక్కడ కూడా విజయాన్ని సాధించారు. ఆ షోతో ఆయన క్రేజ్ వేరే లెవల్ కి వెళ్ళిపోయింది.
ఆ తరువాత వచ్చిన అఖండ సినిమాతో బాలకృష్ణ మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఇంతటి విజయవంతమైన హీరో అప్పుడప్పుడూ కోపిష్టిగా కనిపించినా, ఆయనను బాగా దగ్గర నుండి చూసినవాళ్లు బాలయ్యది చిన్నపిల్లల మనస్తత్వం అని, ఎంతో స్వచ్ఛమైనది అని అంటూ ఉంటారు. వాటికి తగ్గట్టుగానే బాలకృష్ణ సామాజిక సేవ చేస్తూ, ఎంతో మందికి సహాయం చేస్తున్నారు.
ఇక బాలయ్య నటించిన సినిమాలను గమనించినట్లయితే ఒక విషయం బాగా అర్థమవుతుంది. ఆయన సినిమాలలో ఒక కామన్ పాయింట్ కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటంటే బాలయ్య సినిమాలలో తెలుగు వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. బాగా పాపులర్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప, ఆయన సినిమాలో మిగతా వారు దాదాపు తెలుగువారే ఉంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఇతర భాషల వారికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే బాలకృష్ణ సినిమాలలో అయితే తెలుగు వారికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం.
Also Read: స్మోకింగ్ అలవాటును మానేసి, అభిమానులకు ఆదర్శంగా నిలిచిన 10 మంది స్టార్ హీరోలు వీరే..