Ads
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ మూవీ గత ఏడాది విడుదల కాగా, బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు.
Ads
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. అది మాత్రమే కాకుండా ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రోడ్యూసర్ కరణ్ జోహార్, పూరి జగన్నాథ్, ఛార్మీతో కలిసి నిర్మించారు. బాక్సింగ్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ చిత్రంలో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు.
లైగర్ మూవీని భారీ బడ్జెట్ తో రూపొందించారు. షూటింగ్ మొదలైనప్పటి నుండే ఈ చిత్రం పై ఇటు టాలీవుడ్ లోనూ, అటు బాలీవుడ్ లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ కు ముందు విజయ్ దేవరకొండ,పూరీ జగన్నాధ్, ఛార్మి చేసిన ప్రోమోషన్స్ తో సినిమా పై అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. కానీ సినిమా విడుదల అయిన తొలి రోజే ఈ ఫ్లాప్ టాక్ వచ్చింది. ప్రేక్షకులు మూవీ స్టోరీ, పాటలు బాలేదని చెప్పడంతో ఆశించిన విజయాన్ని పొందలేకపోయింది. అంతే కాకుండా మూవీస్ కి రేటింగ్ ఇచ్చే ఐఎంబిడి వరస్ట్ చిత్రాల జాబితాలో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది.
ఇక గతంలో ఛార్మీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి మేము చాలా కష్టపడ్డామని, ఇరవై ఏళ్లుగా సంపాదించిన మొత్తాన్ని దీని కోసం ఖర్చు పెట్టామని చెప్పింది. ఇక ఛార్మీ లైగర్ కోసం 200 కోట్ల వరకు పెట్టినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే లైగర్ పై సోషల్ మీడియా లో ట్రోల్స్ వస్తున్నాయి. కాగా ఈ సినిమా రిలీజ్ ముందు నుండే ట్రోల్స్ మొదలయ్యాయి. నెటిజన్లు ఈ మూవీలోని ఒక మిస్టేక్ ను గుర్తించి ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
ఈ మూవీ క్లైమాక్స్ లో లైగర్ బాక్సింగ్ రింగ్ లోపల ఫైట్ చేస్తూ కింద పడిపోతాడు. అయితే ఈ మ్యాచ్ వెగాస్ లో జరుగుతూ ఉంటుంది. ఇక ఆ మ్యాచ్ ని టివిలో లైగర్ తల్లి భారతదేశంలో చూస్తూ, లైగర్ పడిపోగానే ఉట్నా సాలే అని గట్టిగా అరవడంతో లైగర్ లేచి తిరిగి ఫైట్ చేస్తాడు. ఇక్కడే పూరీ నెటిజన్లు దొరికిపోయాడు. ఇండియాలో ఉన్న రమ్యకృష్ణ అరిస్తే, ఎక్కడో వేరే దేశంలో పడిపోయిన లైగర్ కు ఎలా వినపడిందని ట్రొల్ చేస్తున్నారు. ఈ మూవీలో పెద్ద రాడ్ సీన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” లో ఉన్న మిస్టేక్ ఏమిటో తెలుసా?