Ads
సినిమా హీరోలు ఒక సినిమా చేయడానికి ఎంతో డబ్బుని తీసుకుంటూ ఉంటారు. అప్పటి హీరోల నుండి ఇప్పటి హీరోల వరకు చాలా మంది టాప్ హీరోలు ఎక్కువ డబ్బులు తీసుకున్నారు తీసుకుంటున్నారు. పైగా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రెమ్యూనరేషన్ ని కూడా ఎక్కువగా ఇస్తున్నారు. అప్పటి హీరోలకి రెమ్యూనరేషన్ వేలల్లో కానీ లక్షల్లో కానీ ఉండేది. ఇప్పుడు మాత్రం కోట్లల్లో లేదంటే 100 కోట్ల లో ఉంటోంది.
పైగా చాలా మంది హీరోలు సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా, వ్యాపారాలు అలానే అడ్వర్టైజ్మెంట్లు మొదలైన వాటి ద్వారా సంపాదిస్తున్నారు. మరి టాలీవుడ్ లో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరు..? వాళ్ళ ఆస్తుల విలువలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. అత్యధిక ధనవంతులైన హీరోలు ఇద్దరు. అలానే మరి కొందరు కూడా ఎక్కువే సంపాదించారు. నాగార్జున, చిరంజీవి సినిమాల్లోకి వచ్చి బాగా సంపాదించారు. అలానే వెంకటేష్, బాలకృష్ణ, అల్లు అర్జున్ కూడా ఎక్కువగానే సంపాదిస్తున్నారు.
- అక్కినేని నాగార్జున:
అక్కినేని నాగేశ్వరరావు సంపాదించిన సంపాదన అంతా కూడా నాగార్జునదే. తండ్రికి ఒక్కడే కొడుకు కావడంతో అంతా నాగార్జునకు వచ్చింది. వ్యాపారాలు తో పాటుగా అన్నపూర్ణ స్టూడియో అలానే సినిమాలు ఇలా అన్ని చూస్తే దాదాపుగా 12 వేల కోట్లున్నాయి నాగార్జునకి.
Ads
2. మెగాస్టార్ చిరంజీవి:
150 పైగా సినిమాలు చేసారు చిరు. అప్పట్లో ఇండియాలోనే అత్యధిక రెమ్యూనరేషన్ ని మెగా స్టార్ తీసుకుని రికార్డ్ ని క్రియేట్ చేసేసారు. సినిమాలే కాకుండా రియల్ ఎస్టేట్, వ్యాపారాలతో కూడా సంపాదిస్తున్నారు.
3. వెంకటేష్:
సినిమాలు, రామానాయుడు స్టూడియో, బిజినెస్లు తో థర్డ్ ప్లేస్ లో వెంకటేష్ వున్నారు. 6000 కోట్ల వరకు ఉండచ్చు.
4. బాలకృష్ణ:
బాలయ్య కి రెండువేల కోట్లు ఉండచ్చు. ఎన్టీఆర్ గారి ఆస్తి, సినిమాలతో బాలయ్య సంపాదన ఇలా రెండువేల కోట్లు ఉండచ్చు.
5. అల్లు అర్జున్:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి 1600 కోట్లున్నాయి. ఐదవ స్థానంలో బన్నీ ఏ వున్నాడు.