Ads
ప్రేమ గురించి మాటల్లో చెప్పగలమా..? ప్రేమ రెండు మనసుల కలయిక. ప్రేమ ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి. పైగా ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి కోసం దేనినైనా చేసేయాలని మనకి అనిపిస్తూ ఉంటుంది ఎంతకైనా తెగించొచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇది వరకు ప్రేమని అక్షరాలతో ఓ లేఖ రాసి పంపించేవారు కానీ ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది.
వాట్సాప్ మొదలు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫాముల ద్వారా మన ప్రేమని వ్యక్తపరచడానికి అవుతుంది. పైగా దీని కోసం మనం కేవలం మెసేజ్ ని మాత్రమే టైప్ చేసి పంపక్కర్లేదు.
ఆడియో వీడియో లేదంటే ఇమోజీ వంటివి కూడా పంపుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ యుగం రావడంతో ప్రేమ లేఖలు కనపడడం లేదు సులువుగా ఉంటుందని క్షణాల్లో మనం స్మార్ట్ ఫోన్ ద్వారా సమాచారాన్ని పంపవచ్చు అని ప్రతి ఒక్కరూ ఈ పద్ధతినే ఎంపిక చేసుకుంటున్నారు. చాలామందికి ఇదివరకు ప్రేమ లేఖలు ఎలా ఉన్నాయి అనేది తెలియదు. 100 సంవత్సరాల క్రితం ప్రేమలేఖ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా..? ఆ సమయంలో ఫోన్స్ లేవు కేవలం లేఖల ద్వారా సమాచారాన్ని పంపుకునేవారు.
Ads
బ్రిటన్ కి చెందిన ఒక మహిళ కొడుకు కి ఈ లేఖ దొరికింది. ఒక విరిగిపోయిన టైల్ మధ్యలో ఆ లేఖ కనబడింది. ఇక మరి వందేళ్ళ క్రితం ప్రేమలేఖలో ఏం రాసారు అనేది చూద్దాం. నా ప్రియాతి ప్రియతమా అంటూ స్టార్ట్ చేసారు. ఈ ప్రేమ మనిద్దరి మధ్యనే ఉండాలని.. నాకు పెళ్లయింది కనుక నన్ను రోజు కలువు అని అడగొద్దు అని రాసి వుంది. అలానే రోజు కలిస్తే కొత్త సమస్యలు వస్తాయి. ఇట్లు నీ ముద్దుల ప్రియుడు రోనాల్డ్ అని ఈ లేఖ లో వుంది. కలుసుకోవాలంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్థరాత్రి కలుద్దాం అని ఆ లేఖ లో రాసారు. 1920 కంటే ముందుదే అని తెలుస్తోంది.