Ads
టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ప్రస్తుతం అందరి దృష్టి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మీదనే ఉంది. ఆయన తెరకెక్కించింది నాలుగు చిత్రాలే అయినా విక్రమ్ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను ప్రదర్శించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.
Ads
ఇక లోకేష్ కనగరాజ్ తో మూవీస్ చేయడానికి తమిళ స్టార్ హీరోలు మాత్రమే కాకుండా తెలుగు స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. కార్తీతో తెరకెక్కించిన ఖైదీ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో లోకేష్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ డైరెక్టర్ అయ్యాడు. కాగా లోకేష్ డైరెక్షన్ లో వచ్చిన నగరం సినిమాని ముందుగా తెలుగులోకి డబ్ చేసారు. ఈ చిత్రంలో హీరోహీరోయిన్ లుగా సందీప్ కిషన్, రెజీనా చేశారు. 2017లో రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఇక లోకేష్ దర్శకత్వం చేసిన రెండవ చిత్రం ఖైదీ. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించారు.
ఖైదీ సినిమా హిట్ అవడంతో లోకేష్ కి కోలీవుడ్ స్టార్ విజయ్ తో మూవీ చేసే సూపర్ ఛాన్స్ వచ్చింది. అలా వచ్చిన సినిమా మాస్టర్. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మూడు రోజుల్లోనే 100కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే లోకేష్ లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా విక్రమ్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఎలాంటి హడావిడి చేయకుండా, సైలెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.విక్రమ్ మూవీలో కమల్ హాసన్ మాత్రమే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, విజయ్ సేతుపతి, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ నటించారు. ఈ మూవీతో అందరి దృష్టి లోకేష్ కనకరాజు పైనే ఉంది. ఆయన నెక్స్ట్ మూవీ ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రాలల్లో ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. అది ఏమిటి అంటే ఆయన చిత్రాలు నైట్ మోడ్ లోనే ఉంటాయి. అయితే ఈ మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
Also Read: చిరు, బాలయ్య, నాగార్జునలతో నటించిన సూపర్ స్టార్ కృష్ణ.. వెంకటేష్‌తో నటించకపోవడానికి కారణం..