Ads
హీరోయిన్ మీనా గురించి తెలుగు ఆడియెన్స్ కి ప్రత్యేకంగా పరిచయం చేసియాల్సిన అవసరం లేదు. మీనా బాల నటిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత 1990లో వచ్చిన ‘నవయుగం’ అనే సినిమాతో హీరోయిన్ గా మారింది. ఈ చిత్రంలో వినోద్ కుమార్, రాజేంద్రప్రసాద్ లు నటించారు.
Ads
ఆ తరువాత ఏడాది సీతారామయ్యగారి మనవరాలు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన మీనా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ సినిమా తరువాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టడంతో ఆమె అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మీనా హీరోయిన్ గా అగ్రనటులు అందరితోనూ నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతోనూ, తమిళ, మలయాళ భాషలలో స్టార్స్ తో జోడీ కట్టి అప్పట్లోనే టాప్ హీరోయిన్గా రాణించింది.
తెలుగులో అల్లరి పిల్ల, సుందరకాండ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, అల్లరి మొగుడు, సూర్యవంశం, స్నేహం కోసం లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మీనా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మళయాళ,ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలదు. ఆమె మోడల్‌గా, హీరోయిన్గా, డాన్సర్‌గా, సింగర్‌గా, టీవీ రియాలిటీ షో జడ్జ్‌గా చేస్తూ ఆల్ రౌండర్ అనిపించుకుంది. అయితే మీనా ఎనిమిదేళ్ళ వయసులోనే నటిగా మారడంతో చదవుకు దూరం అయ్యానని బాధ పడేదంట. దాంతో ఆమెకు కొంచెం వయసు వచ్చిన తరువాత ప్రెవేట్ గా చదవు కొనసాగించి ఎంఏ పూర్తి చేసిందంట.
మీనా 1975 లో సెప్టెంబర్ 16న జన్మించింది. ఆమె తండ్రి పేరు దురైరాజ్. ఈయన తెలుగువారే, తమిళ నాడులో స్థిరపడ్డారు. ఆయన తమిళనాడు గవర్నమెంట్ స్కూల్ లో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. ఇక హీరోయిన్ మీనా తల్లి పేరు రాజ మల్లిక. ఆమె ఒకప్పటి తమిళ స్టార్ హీరోయిన్. అంతేకాకుండా మళయాళంలో కూడా రాజమల్లిక స్టార్ హీరోయిన్ గా రాణించారు. తల్లి హీరోయిన్ కావడంతో బాల నటిగా మీనా సినీ పరిశ్రమలో ఎంట్రీ సులువు అయ్యింది.
రాజ మల్లిక మీనాను అగ్ర హీరోయిన్ చేయాలని బలంగా కోరుకున్నారంట. ఆ క్రమంలోనే జెమిని గణేశన్ మీనాని ఒక పార్టీలో చూసి, ఆమెకి మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆఫర్ ఇచ్చారంట. మీనాను హీరోయిన్ చేయడం కోసం ప్రొడ్యూసర్ ఎంఏ రత్నం దగ్గరకు తీసుకెళ్లడంతో ఆమెను చూడగానే మూవీ ఆఫర్ ఇచ్చారంట. అలా మీనాకి ఎక్కడికి వెళ్లినా అవకాశాలు రావడంతో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ అయ్యింది. అలా ఆమె దశాబ్దం పాటు అగ్ర హీరోయిన్ గా రాణించింది.
అయితే 2000 తరువాత మీనాకి హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో ఆమె 2009లో విద్యాసాగర్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని వివాహం చేసుకుని,సెటిల్ అయిపోయింది. ఈ జంటకి ఒక కూతురు. ఆమె కూడా బాలనటిగా కోలీవుడ్ చిత్రాల్లో విజయ్ దళపతి వంటి స్టార్ హీరోలతో నటిస్తోంది. మీనా సెకండ్ మొదలు పెట్టింది. హీరో వెంకటేష్ తో దృశ్యం మూవీలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి, అలరించింది. అయితే గత ఏడాది జూన్ లో మీనా తన భర్తను కోల్పోయి, ఆ బాధలోనే ఉండిపోయింది. ఈ మధ్యే నెమ్మదిగా మళ్ళీ చిత్రాలలో నటిస్తోంది.
Also Read: ఆ స్టార్ డైరెక్టర్ కి కూతురు హీరోయిన్ గా నటించడం ఇష్టం లేదట.. ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా?