Ads
ఒక్కోసారి ఏదైనా నిధి దొరికితే బాగుందని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. పైగా చాలా వార్తల్లో మనం నిధులు దొరికాయి అనడం వింటూ ఉంటాము. ఎక్కువగా నిధులు వ్యవసాయ భూముల్లో ఖాళీ స్థలాల్లో ఇంటి స్థలాల్లో ఆలయాల్లో దొరుకుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయి అని వార్తలు కూడా కనబడుతూ ఉంటాయి. అయితే నిజంగా గుప్త నిధులు దొరికితే మనం వాటిని తీసుకోవచ్చా.
ఎవరికి దొరికితే వాళ్లకి మొత్తం తీసుకునే హక్కు ఉందా లేదా..? ఈ సందేహం నాకు చాలాసార్లు కలిగింది. మీకు కూడా కలిగిందా..? అయితే ఇప్పుడే ఆ సందేహాన్ని క్లియర్ చేసుకోండి.
గుప్త నిధులు ప్రభుత్వానికి చెందుతాయా లేదంటే ఎవరికి దొరుకుతాయో వాళ్ళు తీసుకోవచ్చా..?
భూమిలో దొరికిన నిధులని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అయితే ఒకసారి ఆ నిధులను ప్రభుత్వం తీసుకున్నాక మళ్ళీ వాటిని యజమానులకు ఇస్తుందా ప్రభుత్వం కనీసం అందులో కొంచమైనా ప్రభుత్వం ఇస్తుందా అని కూడా మీకు అనిపించే ఉంటుంది అయితే మనకి ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదు.
Ads
ప్రజలకి ఈ భూమి లోపల దొరికిన నిధి మీద హక్కు లేదు. ప్రభుత్వానికి చెందినది అవుతుంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చట్టం లో కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన నిధులు జాతి వారసత్వ సంపద. అయితే వాటి మీద ఎవరికి ఎలాంటి హక్కు ఉండదు. ఆ నిధిని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానిదే అని చట్టం చెబుతోంది.
బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేటప్పుడు మన దేశంలో ఉన్న ఆలయాల్లో రాజులు దాచిపెట్టిన నిధులు వంటి వాటి మీద కన్ను వేసింది. ఆలయాలని ధ్వంసం చేసేసి దొరికిందంతా దోచుకుపోయారు. 1878లో ఒక యాక్ట్ పేరిట బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. బ్రిటిష్ వారు నిధులు ఎవరు తవ్వి తీసుకుంటే వారికే సొంతం అని ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. స్వాతంత్రం తర్వాత దీనిని మన భారత ప్రభుత్వం మార్చింది.
ఈ చట్టం ప్రకారం గుప్త నిధులు చారిత్రక వారసత్వ సంపద. అయితే ఆర్కియాలజీ శాఖ స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకంటే ఈ భూమిలో దొరికే ఈ నిధులు పూర్వికులు ఉనికిని కాపాడే వస్తువులు. అయితే పూర్వీకులు కనుక దాచి ఉన్నట్లయితే పూర్వీకుల వారసులకి వాటిని పంచుతారు. నిధుల్లో 1/5 వ వంతు ని దొరికిన వారికి ఇస్తారు ఒకవేళ కనుక ప్రభుత్వానికి చెప్పకుండా నిధిని కాజేయాలని అనుకుంటే జరిమానా, జైలు శిక్ష తప్పవు.