Ads
తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది దర్శకులు సాధారణ హీరోలుగా ఉన్న చాలా మందికి హిట్స్ ఇచ్చి ఆ హీరోలను స్టార్ హీరోలుగా చేసారు. అంతేకాకుండా ఆ విజయవంతమైన చిత్రాల ద్వారా ఆ దర్శకులు కూడా పరిశ్రమలో స్టార్ డైరెక్టర్స్ గా పేరు తెచ్చుకున్నారు.
అయితే ఏం లాభం ఆ స్టార్ డైరెక్టర్స్ తమ కుమారులు హీరోలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి సినిమాలు చేయడం మొదలు పెట్టిన తరువాత ఈ డైరెక్టర్స్ వారికి ఒక్క హిట్ ఇవ్వలేకపోయారు. కొడుకులకు కనీసం ఒక్క విజయాన్ని ఇవ్వని ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Ads
1.దాసరి నారాయణ రావు:
దర్శకరత్నగా పేరు గాంచిన దాసరి నారాయణ రావు చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాయి. అప్పట్లో దాసరితో ఒక్క మూవీ చేస్తే చాలని అగ్ర హీరోలు అనుకునేవారు. 150 చిత్రాలకి దర్శకత్వం వహించిన ఒకే ఒక డైరెక్టర్ గా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో దాసరి నారాయణ రావు పేరు నమోదు అయ్యింది. అయితే ఇంత గొప్ప దర్శకుడు అయిన దాసరి తన కుమారుడు అరుణ్ కుమార్ కి హిట్ ఇవ్వలేకకపోయాడు. అరుణ్ హీరోగా చిన్నా మూవీ చేసినా అది హిట్ కాలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఇతరులు డైరెక్షన్ చేసినా అవి కూడా విజయం పొందలేదు.2. కోదండ రామిరెడ్డి:
కోదండ రామిరెడ్డి ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు. చిరంజీవిని మెగాస్టార్ ని చేయడంలో దర్శకుడిగా కోదండ రామిరెడ్డి చాలా కీలకమైన పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఆయన తన కుమారుడు వైభవ్ హీరోగా గొడవ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా ప్లాప్ అయింది.
3. పూరి జగన్నాథ్:
పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి మహేష్ బాబుని సూపర్ స్టార్ ను చేసిన పూరి జగన్నాథ్, తన కుమారుడు అయిన ఆకాష్ పూరికి హిట్ ని ఇవ్వలేకపోయాడు. ఆకాష్ హీరోగా తెరకెక్కించిన మెహబూబా చిత్రం ప్లాప్ గా నిలిచింది.
Also Read: ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘కొమురం భీముడో పాట’ వెనుక ఉన్న స్టోరిని చెప్పిన రాజమౌళి..!