Ads
దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పేరు ఇప్పుడు ఇండియాలో మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా చెప్పుకునేలా తన సత్తాను చాటారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పాడు.
Ads
ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ చిత్రం. ఆస్కార్ కోసం ఎదురుచూస్తోంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఈ అవార్డ్ వేడుక కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ తదితరులు అక్కడికి చేరుకున్నారు. ఇక రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నంబర్ వన్. ఈ మూవీలో హీరో జూనియర్ ఎన్టీఆర్. అయితే జూనియర్ ఎన్టీఆర్ ని మొదటిసారి చూసినపుడు రాజమౌళి ఏం అనుకున్నారో ఇటీవల ఒక ఇంటర్వ్యూ వెల్లడించారు. ఇంతకి జక్కన్న తారక్ ను మొదట్లో ఏమని అనుకున్నారో ఇప్పుడు చూద్దాం..
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన మొదటి సినిమా నిన్ను చూడాలని. ఈ మూవీ తరువాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక చిత్రం చేయాలని అనుకున్నారు. అయితే ఆయన ఏవో కారణాలతో డైరెక్షన్ చేయడం మానేసి, దర్శకత్వ పర్యవేక్షణ పనులు మాత్రమే చూస్తూ వచ్చారు. ఆ సమయంలో జక్కన్న ‘శాంతినివాసం’ అనే సీరియల్ చేస్తున్నాడు. అప్పుడు ఆయనకు సినిమా ఛాన్స్ రావడంతో రాజమౌళి ఆ సీరియల్ బాధ్యతలను కో డైరెక్టర్ కి అప్పగించి, స్టూడెంట్ నం.1 మూవీకి డైరెక్టర్ గా మారారు.రాజమౌళికి తొలి మూవీ అవడంతో చాలా ఎక్సైట్మెంట్ గా ఫస్ట్ డే షూటింగ్ స్పాట్ కి వెళ్లాడంట. అయితే అక్కడ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను చూడగానే, ఇతనేంటి ఇలా ఉన్నాడని నిరుత్సాహపడ్డాడంట. నా తొలి సినిమాను అనవసరంగా వీడితో ఒప్పుకున్నానే, ఇరుక్కుపోయానా ఏంటి అని అనుకున్నానని రాజమౌళి తెలియజేశారు. ఆ టైమ్ లో ఎన్టీఆర్ కి మీసాలు కూడా లేవు.
ఎంతో లావుగా ఉన్న తారక్ నడక చూసి, చాలా వింతగా అనిపించడంతో, ఇతనితో నా ఫస్ట్ మూవీ చేయాల్సి రావడం నా కర్మ అనుకున్నానని వెల్లడించాడు. అయితే షూటింగ్ మొదలై, సగంలోకి వచ్చేసరికి రాజమౌళి, తారక్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఎన్టీఆర్ నటన కూడా నచ్చింది. అప్పుడు అన్ని ఉన్న గుర్రంతో గెలిసే కన్నా, కుంటి గుర్రంతో రేస్ గెలిస్తే కిక్ ఉంటుందని భావించారంట. అలా ఆ మూవీ సమయంలో ఎన్టీఆర్ ప్రతిభని రాజమౌళి గమనించాడు. ఆ మూవీ సూపర్ హిట్ అయింది.
Also Read: ఎన్టీఆర్ భార్య బసవతారకం, చిరంజీవి భార్య సురేఖలో ఉన్న పోలిక ఏమిటో తెలుసా?