Ads
సరైన ఆహారపు అలవాట్లను పాటించనట్లయితే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో శరీరంలోని అవయవాలు ప్రభావితం అవుతాయి. అలాంటి అవయవాలలో కిడ్నీలు కూడా ఉన్నాయి. శరీరంలోని అవయవాలలో మూత్రపిండాలు కూడా ముఖ్యమైనవి.
Ads
మూత్రపిండాలు పనితీరులో వచ్చే చిన్న మార్పుల వల్ల ప్రమాదకరమైన సమస్యలు రావచ్చు. కిడ్నీలు యూరిన్ ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. తద్వారా మనిషిని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి. అందువల్ల మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కిడ్నీల్లో రాళ్ల సమస్య రావడం ఈ మధ్య కాలంలో చాలా సాధారణం అయ్యింది. అయితే ఈ సమస్యను నివారిచడానికి కొన్ని అలవాట్లను పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.నీరు :
కిడ్నీలు శుభ్రం కావాలంటే శరీరానికి అవసరమైనంత మోతాదులో నీరు తాగడం ముఖ్యం. నీరు ఎక్కువగా తాగడం వల్ల మూత్రపిండాల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. తక్కువ నీటిని తగినపుడు వ్యర్థ పదార్థాలు కిడ్నీల్లో పేరుకుపోతాయి. రోజుకి కనీసం 3 లీటర్ల నీరు త్రాగాలని వైద్యులు సూచిస్తున్నారు.
2.సోడియం అధికంగా ఉండే ఆహారం :
సోడియం ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అంతే కాకుండా రక్తపోటు స్థాయిలను సైతం ప్రభావితం చేస్తుంది. అందువల్ల మూత్రపిండాలు, గుండె ఆరోగ్యం కోసం ఆహారంలో ఉప్పును తగ్గించాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, బేకింగ్ సొడా వాడే ఆహారాలకు కూడా దూరంగా ఉండడం మంచిది.
3.ఆక్సలేట్ కలిగిన ఆహారం:
క్యాబేజీ, పాలకూర, చాక్లెట్, టొమాటోలు, చిక్ పీస్, గోధుమ లాంటి ఆహారంలో ఆక్సలేట్ మూలాలు ఉన్నాయి. ఇవి తీసుకోవడం వల్ల రక్తంలో ఆక్సలేట్ స్థాయిలు పెరుగుతాయి. దాంతో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఎర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆక్సలేట్ కలిగిన ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం మంచిది.
4.నాన్ వెజ్ :
నాన్ వెజ్ మితంగా తీసుకోవడం మంచింది. మాంసం, చేపలు, గుడ్డు లాంటి వాటిలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. మాంసం నుంచి లభించే ప్రోటీన్స్ లో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడం ద్వార కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
5.కూరగాయలు:
ఎక్కువగా కూరగాయలు తీసుకోవాలి. గుమ్మడికాయ, చిలగడదుంపలు, పప్పులు, బీన్స్, గింజలు మొదలైనవి తీసుకోవచ్చు.
Also Read: విపరీతమైన డిప్రెషన్, గుండె జబ్బులకు కారణం కరోనా.. రీసెర్చ్ లో విస్తుపోయే నిజాలు..