ఆస్కార్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన ‘నాటు నాటు పాట’ గురించి ఈ విషయాలు తెలుసా?

Ads

ఆస్కార్‌ వేదిక పై మన తెలుగు చిత్రం సత్తా చూపింది. భారతదేశం అంతా ఎంతగానో ఎదురుచూసిన తరుణం వచ్చేసింది. జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది. ఆస్కార్‌ వేదిక పై కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ లు ఈ పాటను పాడగా, ఆమెరికన్‌ నటులు డాన్స్ చేశారు. పాడటం పూర్తవగానే ప్రేక్షకులు స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇచ్చారు.

భారతీయ చిత్రానికి కొన్నేళ్లుగా కలగా ఉన్న ఆస్కార్ అవార్డ్ ను అందుకుని ఆర్ఆర్ఆర్ మూవీ సాకారం చేసింది. నాటు నాటు పాట సందర్భం, పాట యొక్క అర్ధం, పాటను చిత్రీకరించిన విధానం, సంగీతం, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అందించిన డాన్స్, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన విధానం ఇలా అన్ని కలిసి ఈ పాటని ఆస్కార్ అందుకునేలా చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ  పాట గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం..
పాట రాయడానికి పట్టిన సమయం.. 
ఈ పాట వచ్చే సందర్భం విన్న తరువాత చంద్రబోస్ సగం పాటను ఒక్క రోజులోనే రాసారంట. కానీ మిగతా సగం రాయడానికి ఆయనకి సంవత్సరం పైనే పట్టిందంట. ఆ సమయంలో చాలా మార్పులు చేశారంట.
ఢిల్లీ అనుకుంటే యుక్రెయిన్..
నాటు నాటు రాయడంతో పాటు పాడడం పూర్తయింది. చిత్రీకరణ మిగిలింది. అయితే ఈ విషయంలో విధానంలో రాజమౌళి ఎక్కడ కూడా రాజీపడలేదు. ముందు ఈ సాంగ్ ని ఢిల్లీలోని ఎర్ర కోట, లేదా వేరే ఏదైనా చారిత్రాత్మక కట్టడంలో చిత్రీకరించాలని అనుకున్నారు. అవి ఏమి కుదరక పోవడంతో యుక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలస్ లో చిత్రీకరణ జరిపారు.
పాట చిత్రీకరణకు పట్టిన సమయం మరియు ఖర్చు..
ఈ పాట కోసం యుక్రెయిన్ లో 15 రోజుల పాటు షూట్ చేసారు. 15 రోజులకి దాదాపు 15 కోట్ల వరకు  ఖర్చు పెట్టారంట. ఎందుకంటే ఈ పాటలో చేసిన వాళ్లంతా ప్రొఫెషనల్ డాన్సర్స్. కాస్ట్యూమ్స్, వాళ్ళ  ఫీజు కలిపి పెద్ద మొత్తంలోనే నిర్మాత దానయ్య ఖర్చు పెట్టారు.
ఎన్ని టేకులు తీసుకున్నారంటే..
ఈ సాంగ్ కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో కలిసి రాజమౌళి సుమారు 80 రకాల హుక్ స్టెప్స్ ను ఎంపిక చేసాడు. పాటలో కనిపిస్తున్న హుక్ స్టెప్ ను ఫైనల్ చేశారు. జక్కన్న ఈ స్టెప్ కోసం తారక్ -చరణ్ లతో 18 టేకులు తీసుకున్నాడంట. వాటిలో చివరకు ఆ 18 టేకుల్లో వాళ్ళు రెండవ సారి చేసిన టేక్ ను తీసుకున్నారంట.
పాట కోసం పడిన కష్టం..
రామ్ చరణ్ ఈ సాంగ్ రిహార్సల్స్ చేస్తూ ఆరు రోజుల్లో సుమారు నాలుగు కిలోల బరువు తగ్గాడంట. దీన్ని బట్టి చూస్తే ఈ సాంగ్ కోసం జక్కన్న ఎంత కష్ట పెట్టాడో అర్ధం అవుతుంది. అయితే వారి కష్టం తెర మీద కనపడుతుంది.
వారి కష్టానికి ఫలితం.. 
ఈ పాట కోసం గేయ రచయిత చంద్రబోస్ నుండి యాక్టర్స్, కొరియోగ్రాఫర్స్ ఇలా అందరు పడ్డ కష్టానికి రిజల్ట్ గా ముందుగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. భారతీయ సినిమా పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం ఇదే తొలిసారి.
గోల్డెన్ గ్లోబ్ టూ ఆస్కార్ .. 
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ పాటను తాజాగా ఆస్కార్ వరించింది. 95 ఏళ్ల ఆస్కార్స్ హిస్టరీలో భారతీయ చిత్రం పాటకి అవార్డ్ రావడం ఇదే తొలి సారి.
Also Read: సీనియర్ ఎన్టీఆర్ టూ చిరంజీవి.. ఎన్నో అవమానాలు ఎదుర్కొని స్టార్లుగా ఎదిగిన 7 గురు హీరోలు..

Ads

Previous articleఅక్కినేని, మంచు కుటుంబాలకి ఆ విషయంలో కలిసి రావడం లేదా..?
Next articleఅత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గురించి ఆసక్తికర విషయాలు..
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.