చాణక్యు నీతి ప్రకారం ఈ లక్షణాలు ఉన్నవారికి విజయం బానిస అవుతుంది..

Ads

జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం పొందడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అందులో కొందరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇక విజయానికి ఒక్కొక్కరు ఒక్కోరకంగా నిర్వచనం ఇస్తుంటారు.

అయితే మనిషి తన జీవితంలో ఎలా జీవించాలో, ఎలా వ్యవహరించాలో, వేటికి దూరంగా ఉండాలనేదాని గురించి ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. వాటిని తమ జీవితంలో పాటించడం వల్ల  ఆర్థిక నష్టాలను, వివాదాలను నివారించడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే జీవితంలో విజయం పొందడానికి చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పిన వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం..

Ads

1. విద్య:
ఆచార్య చాణక్యుడు చదువుకు ఉన్న ప్రాముఖ్యత గురించి వివరించారు. చదువుకున్న వ్యక్తి అతను  ఎక్కడికి వెళ్లినా అక్కడ గౌరవం పొందుతారని, జీవితంలో విజయం పొందడంలో చదువు ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు.
2.బలం మరియు బలహీనత:
జీవితంలో విజయం సాధించాలంటే మన బలం మరియు బలహీనతలను ఇతరులకు చెప్పకూడదు. ఒకవేళ చెప్పినట్లయితే, ఇతరులు మీకున్న బాలహీనతను వ్యతిరేకంగా ఉపయోగించే ఛాన్స్ ఉందని తెలిపారు. బలం గురించి తెలిస్తే మిమ్మల్ని ఎదుర్కొవడానికి సరైన పథకాన్ని రూపొందించే అవకాశం ఉంటుందని వివరించారు.
3.తర్కించడం:
ఎవరైన కూడా జీవితంలో విజయం సాధించాలంటే పని చేయడం, కష్టపడడటం ముఖ్యం అని చాణక్యుడు తెలిపారు. పని చేసే ముందు 3 ప్రశ్నలను గుర్తించుకోవాలని తెలిపారు. పని చేయడానికి కారణం ఏమిటి? పనికి ఫలితం ఎలా ఉంటుందని? విజయం పొందడం సాధ్యమవుతుందానే విషయాల గురించి బాగా ఆలోచించినపుడు సంతృప్తికరమైన జవాబు వచ్చినపుడే ఆ పనిని చేయాలని తెలిపారు.
4.ప్రేమ, దయ గుణాలు:
పుష్పం యొక్క సువాసన గాలి ఉన్న మాత్రమే వ్యాపిస్తుంది. కానీ ఒక మనిషి మంచితనం అన్ని వైపులా  వ్యాపిస్తుందని చాణక్యుడు తెలిపారు. ఒక మనిషి సంస్కృతి, సంఘంతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఇతరులతో కరుణతో ఉన్నప్పుడు తన జీవితంలో విజయం సాధించగలరని నీతి గ్రంథంలో తెలిపారు.
5.తప్పుల నుండి నేర్చుకోవడం:
జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేయడం అనేది సహజం. కానీ వాటిని నుండి పాఠం నేర్చుకుని మళ్లీ తప్పు చేయనివారే తమ జీవితంలో విజయం సాధిస్తారని చాణక్యుడు తెలిపారు.
Also Read: భర్తలు భార్యకు అస్సలు చెప్పకూడని 4 విషయాలు..

Previous articleఅత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ గురించి ఆసక్తికర విషయాలు..
Next articleసూపర్ స్టార్ కృష్ణ కాల‌ర్ ప‌ట్టుకున్న అక్కినేని నాగార్జున‌.. భ‌గ్గుమ‌న్న కృష్ణ అభిమానులు ఏం చేశారంటే..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.