Ads
ఆచార్య చాణక్య ఎంతటి మహా జ్ఞానో మనకే తెలుసు. ఆచార్య చాణక్య మన జీవితంలో జరిగే చాలా సమస్యల గురించి వివరించారు. నిజానికి ఆచార్య చాణక్య చెప్పినట్లు మనం చేస్తే ఆ సమస్యల నుండి సులభంగా బయటపడొచ్చు. చాణక్య నీతి ద్వారా ఎన్నో గొప్ప విషయాలని చాణక్య మనతో చెప్పడం జరిగింది. ప్రతి ఒక మనిషి కూడా జీవితంలో ఏదో ఒక సమస్యని నిత్యం ఎదుర్కొంటూ ఉంటారు.
ఎలా అయితే మన జీవితంలో ఆనందం ఉంటుందో అలానే కష్టాలు కూడా ఉంటాయి. ఓ రోజు దుఃఖము ఉంటే ఓ రోజు సుఖం ఉంటుంది రెండు జీవితంలో ఉంటేనే అది జీవితం అవుతుంది.
ఆచార్య చాణక్య భార్యాభర్తల గురించి స్నేహం గురించి విజయం గురించి ఇలా ఎన్నో విషయాలని చెప్పారు. మన జీవితంలో మనం చాలామందిని కలుసుకుంటూ ఉంటాము. ఎంతో మందితో మన జీవిత ప్రయాణం సాగుతూ ఉంటుంది. అటువంటప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. పైగా మనుషులందరూ కూడా ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు స్వభావం తీరు ఒక విధంగా ఉంటుంది అయితే కొంతమంది వ్యక్తులతో మాత్రం దూరంగా ఉండాలని చాణక్య అంటున్నారు.
Ads
పైకి చూడడానికి వాళ్ళు చాలా బాగా కనపడతారని వాళ్ళతో స్నేహం మనకే ప్రమాదం అని చాణక్య అన్నారు. ఇటువంటి వ్యక్తులతో మనం ఉంటే నిత్యం కష్టం నష్టమే తప్ప ఫలితం ఏమి ఉండదని అన్నారు. మరి ఎలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి ఎలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
#1. అహంకారం:
అహంకారం ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. అహంకారం వలన మీకే హాని కలుగుతుంది అని చాణక్య అన్నారు. అహంకారం ఉన్న వ్యక్తి మన ప్రగతిని ఉన్నతిని చూసి సహించలేరు అలాంటప్పుడు ఏదైనా నష్టం కలుగుతుంది. అలానే ఇటువంటి వ్యక్తులు తప్పులుని అస్సలు అంగీకరించరు అని చాణక్య అన్నారు. పైగా వీళ్ళతో స్నేహం ప్రమాదము అన్నారు.
#2. మోసం చేసే వాళ్ళు:
మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ కూడా స్వార్థం కోసమే పని చేస్తూ ఉంటారు. అలాంటి వారికి కూడా దూరంగా ఉండాలి. మోసం చేసే వాళ్ళని నమ్మితే మనమే మోసపోవాల్సి వస్తుంది.
#3. నిత్యం స్త్రీ వెంటపడేవారు:
నిత్యం స్త్రీ వెనుక పడే వాళ్ళతో కూడా దూరంగా ఉండాలి వీళ్ళతో కూడా ఎప్పుడు ప్రమాదమే అని చాణక్య అన్నారు.
#4. అత్యాశ, స్వార్ధపరులు:
అత్యాశ స్వార్థపరులకు కూడా దూరంగా ఉండాలి అతిగా ఆశపడే వాళ్ళకి స్వార్థపరులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళతో స్నేహం కూడా ప్రమాదాన్ని కలిగిస్తుంది.