హనుమంతుని తోక కి గంట ఉండడం వెనుక.. రహస్యం ఏమిటో మీకు తెలుసా..?

Ads

ప్రతి హిందువు కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు ఆంజనేయస్వామి ఆలయం లేని ఊరు కూడా ఉండదు. చాలా చోట్ల ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. ఆంజనేయుడికి తోక ఉంటుంది ఆ తోకకి ఒక గంట ఉంటుంది. ఎందుకు హనుమంతుని తోకకి గంట ఉంటుంది ఆ గంట వెనక రహస్యం ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. ఇక కథ చూసేయండి..

శ్రీరామ వనవాస ఘట్టం అది. తండ్రి దశరధుడు కైకైకు ఇచ్చిన మాట ప్రకారం భరతుని పట్టాభిషేకం కోసం అడవులకు రాముడు వచ్చాడు. సీతాదేవి లక్ష్మణుడు కూడా రాముడితో పాటు వచ్చారు. సీతమ్మ అపహరణ అప్పుడు అనుకోకుండా జరిగినది. శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతున్న గ్రామంలో రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు హనుమంతునితో స్నేహం ఏర్పడింది. వానర రాజుగా అన్న స్థానంలో సుగ్రీవుడు కూర్చున్నాడు. సీతమ్మ జాడ కనిపెట్టడానికి వానరుల్ని పంపాడు. హనుమంతుడు సీతమ్మ ఎక్కడుంది అనేది కనిపెట్టాడు యుద్ధం తప్ప వేరే మార్గం లేదని అనుకున్నాడు రాముడు.

వానర కుటుంబాలు యుద్ధానికి వెళుతూ ఒక్కసారిగా చూసుకుంటున్నాయి. ఒకవైపు స్వామివారి కార్యం ఇంకోవైపు పేగు బంధం స్వామి కార్యానికి సిద్ధమయ్యారు వానర వీరులు. ఇది చూసి రాముడు కదిలిపోయాడు కరిగిపోయాడు. సైన్యం అంతా సిద్ధమైంది అప్పుడు రాముడు లేచాడు. వానరులారా మీ బిడ్డలని భర్తలని సోదరుని బంధువుల్ని నాకోసం నా స్వార్థం కోసం యుద్ధానికి పంపిస్తున్నారని యుద్ధానికి ఎంతమందిని తీసుకు వెళుతున్నానో అంతమందిని వెనక్కి తీసుకువస్తానని రాముడు చెప్పాడు. రామసేవ కోసం సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు వంటి వాళ్ళతో పాటు సింగిలికులు అని పిలవబడే పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఇవి కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి.

ఎలాంటి ఆయుధాలు వాటికి ఉండవు. పదునైన పళ్ళు గోళ్లు వాటి ఆయుధాలు కొన్ని వందల సింగిలికలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. రామ రామ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణులు చేతిలో చాలామంది చనిపోయారు రావణాసురుడు కుమారులు కూడా చాలామంది ప్రాణాలని కోల్పోయారు. అప్పుడు రావణుడు కుంభకర్ణుడు మాత్రమే మిగిలారు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేల మీద నిలబడితే తల ఆకాశంలోకి వెళుతుంది. అంతటి భారీ దేహం ఎత్తయిన మహారథంలో కూర్చుని వచ్చాడు కుంభకర్ణుడు ఆ రథం పై భాగంలో ఉన్న గొడుగుకి చిన్న చిన్న గంటలు ఉన్నాయి. ఆ గంటల చప్పుడికి విరుచుకుపడుతున్నాడు కుంభకర్ణుడు. రామ బాణం దెబ్బకి కుంభకర్ణుడు నేల కూలాడు. అయితే రథం మీద నుండి పడుతున్న క్రమంలో కుంభకర్ణుడు చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది.

Ads

ఆ సమయంలోనే 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళ్తాయి. కుంభకర్ణుడి రథం మీద నుండి వచ్చిన ఒక గంట నేరుగా కోతి పైన పడింది. ఆ గంట చాలా పెద్దగా ఉంది. భారీ ఆకారంతో ఉంది. కోతులేమో మరుగుజ్జులు దీంతో వెయ్యి కోతలు కూడా గంట కింద ఇరుక్కుపోయాయి. చీకటి కూడా పడిపోయింది. ఈ కోతుల్లో భయం మొదలైంది ఎవరూ రాకపోవడంతో ఈ విధంగా కోతులన్నీ మాట్లాడుకుంటున్నాయి.. మనల్ని కాపాడ్డానికి ఎవరు రాలేదు చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటే మనం తప్పు చేశామని ఇంకో కోతి అవును మన రాజు మంత్రి ఇద్దరు మూర్ఖులే వాళ్లని నమ్మి మోసపోయామని ఇంకొకటి… ఇలా మాట్లాడుకుంటున్నాయి.

అసలు రాముడు ఎవడు అతనికి మనకి సంబంధం ఏముంది అయినా కూడా వచ్చాము కనీసం మన గురించి పట్టించుకుంటున్నాడా నమ్మకద్రోహి మోసగాడు అంటూ ఒక కోతి అంటే… అవునవును అని ఇంకొన్ని కోతులు… ఒక ముసలి కోతి ముందుకు వచ్చి అనవసరంగా ఆడిపోసుకోవడం వల్ల ప్రయోజనం లేదు సహనంతో ఉందాం రామస్మరణ చేద్దామని అంది.. ఆ మాటలకి మిగతా కోతులు కిచికిచా నవ్వాయి. అయినా సరే ఆ పెద్ద కోతి రామ తారక మంత్రాన్ని జపించింది. కొంచెం సేపటికి అన్ని కోతులు కూడా రామనామ సంకీర్తనలు తో మునిగిపోయాయి. ఇక్కడ ఇలా జరుగుతుంటే గంట బయట రాముడు రావణుని సంహరించాడు సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు అయోధ్యకి బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుడు పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు.

అందరు వున్నారో లేదో లెక్కించి రమ్మన్నాడు ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయి అని అన్నారు. సాక్షాత్తు రామచంద్రుడే వాటి కోసం బయలుదేరారు. ఇంతలో స్వామి దృష్టి ఒక గంట మీద పడింది. హనుమాన్ అని అన్నాడు. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. సుగ్రీవుడు లెక్కపెట్టగా సరిపోయాయి. ఆ కోతులు వెంటనే రామ పాదారవిందపై పడ్డాయి. రాముని దృష్టి ఇప్పుడు హనుమంతుడి మీద పడింది. సుందరే సుందరం కప: ముద్దాయిన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపెంగా చూశాడు రాముడు. ఇలా హనుమంతుని తోకకి గంట వచ్చింది.

Previous articleపబ్బుల్లో ఎందుకు అంత సౌండ్ మ్యూజిక్ పెడతారు..? వామ్మో అదా రీజన్..!
Next articleఈ కోడి మాంసం కిలో రూ.900…దీని స్పెషల్ ఏమిటి అంటే..?