అమ్మవారికి నిమ్మకాలయతో చేసిన దండలని ఎందుకు వేస్తారు..? కారణం ఇదే..!

Ads

ఈ రోజుల్లో కూడా చాలా చోట్ల పూర్వీకులు పాటించిన పురాతన పద్ధతుల్ని ఇంకా పాటిస్తున్నాము. వాళ్లు ఎందుకు పాటించారో మనకు తెలియదు కానీ వాళ్లు పాటించారని మనం చాలా ఆచారాలను వదిలేయకుండా పాటిస్తున్నాము. కొన్ని కొన్ని సార్లు మనకి పూర్వీకులు ఎందుకు ఆ పద్ధతి పాటించారు అనే దాని వెనుక రీజన్ తెలుస్తుంది అప్పుడు ఓహో ఇందుకే వాళ్ళు చేశారు మనం కూడా చేయాలి అని అనుకుంటూ ఉంటాము. తాజాగా ఎప్పటి నుండో పాటిస్తున్న ఒక ఆచారం వెనుక కారణం బయటపడింది దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం.

దేవాలయాల్లో అమ్మవార్లకి చీరలు కట్టి ఎంతో అందంగా అలంకరిస్తారు. అలానే నిండుగా ఆభరణాలను కూడా వేస్తారు. చాలామంది భక్తులు ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు. వివిధ రకాల పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు. పండుగ సమయంలో బట్టలని కూడా అమ్మవారికి ఇస్తూ ఉంటారు. కొత్త చీరలని అమ్మవారికి ఇచ్చి వెళ్తుంటారు భక్తులు కొన్ని దేవతలకి అయితే నిమ్మకాయల దండలని కూడా వేస్తుంటారు.

Ads

మామూలుగా లక్ష్మీదేవికి కానీ సరస్వతి దేవికి కానీ నిమ్మకాయ దండలు వేయరు కానీ గ్రామాల్లో ఉండే అమ్మవారికి మాత్రం నిమ్మకాయలతో చేసిన దండాల్ని వేస్తారు. దారానికి నిమ్మకాయల్ని గుచ్చి ఆ నిమ్మకాయ దండని అమ్మవారికి వేస్తారు. ఎందుకు అలా వేస్తారు దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. అమ్మవారు రక్షణ బాధ్యతను కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా శత్రుసంహారాన్ని లయత్వాన్ని నిర్వహిస్తూ ఉంటారు. లైకారుని శక్తి అమ్మవారు. అమ్మవారికి తామస గుణం ఉంది.

దేవి సంహారక్రియని నిర్వహించేటప్పుడు తామస ప్రవృత్తిని అమ్మవారు ప్రదర్శిస్తారు గ్రామానికి రక్షణగా గ్రామం అంతా తిరిగి కాపలా కాస్తూ ఉంటారు. అలాంటి వీరత్వాన్ని ప్రతిపాదించడానికి నిమ్మకాయల దండాలని వేస్తారు. అలానే అమ్మవారికి గుమ్మడికాయలను కూడా ఇస్తూ ఉంటారు. మామూలుగా అమ్మవారికి బలి ఇచ్చేటప్పుడు శిరస్సుని ఇవ్వాలి. శిరస్సుకి ప్రతీక గుమ్మడికాయ అందుకని గుమ్మడికాయని ఇస్తారు. గుమ్మడి కాయలు ఇవ్వడం నిమ్మకాయల దండలు వేయడానికి కారణం ఇదే. ఎప్పటినుండో కూడా ఈ పద్ధతి పాటిస్తూ వచ్చాము ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగుతోంది.

 

Previous articleఫ్యాక్టరీల పైకప్పుపై ఉండే వీటిని ఎప్పుడైనా గమనించారా..? వాటి వలన ఉపయోగం ఏమిటి అంటే..?
Next articleమీ “పిడికిలి” ని బట్టి మీరు ఎలాంటి వారు అనేది చెప్పేయొచ్చు… ఎలానో తెలుసా..?