తెలుగు సినిమా కాన్సెప్ట్ తో వచ్చిన… ఆ హాలీవుడ్ సినిమా గురించి మీరు విన్నారా..?

Ads

గోపీచంద్ నటించిన ఒక్కడున్నాడు సినిమా మీకు గుర్తుందా..? చంద్రశేఖర్ ఎలేట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 2007లో ఈ సినిమా రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఇది వచ్చింది. ఈ సినిమాలో మహేష్ మంజ్రేకర్, నేహా జుల్కా, గోపీచంద్ తదితరులు నటించారు. ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకత్వం అందించారు. చెర్రీ ఈ సినిమాని నిర్మించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి హిట్ ని అందుకుంది. అయితే మామూలుగా దర్శకులు సినిమాని తెర మీదకి తీసుకు రావడానికి కథ ని రాస్తుంటారు.

కథ రాసే క్రమంలో కొంత మంది కొత్త కాన్సెప్ట్ ని తీసుకోకుండా ఏదైనా సినిమాను చూసి ఆ కథని కాపీ కొట్టి కాస్త మార్పులు చేసేసి సినిమాని తీసుకొస్తూ ఉంటారు. అయితే మీకు ఒక విషయం తెలుసా..? కేవలం హాలీవుడ్ రేంజ్ లో ఉండే సినిమాని కాపీ కొట్టి వేరే భాషలో సినిమాలు తీస్తూ ఉంటారు కానీ తెలుగు సినిమాని కాపీ కొట్టి హాలీవుడ్ లో ఒక సినిమాని తీశారు అని..

Ads

మన కాన్సెప్ట్ ని హాలీవుడ్ వాళ్ళు కాపీ కొట్టి అక్కడ సినిమాని తీయడం జరిగింది. ఇక అదే సినిమా అనేది చూస్తే.. ఒక్కడున్నాడు సినిమాని కాఫీ కొట్టి హాలీవుడ్ వాళ్ళు గెట్ ది గ్రింగో సినిమాని తీశారు. ఒక ముసలి గ్యాంగ్స్టర్ ప్రమాదంలో పడతాడు ఇక అతను చనిపోతాడు అన్న పరిస్థితిలో ఉంటాడు. అటువంటి సమయంలో రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి కావాలి.

అదే బొంబాయి బ్లడ్ గ్రూప్. ఈ బ్లడ్ ఉన్న వాళ్ల కోసం చూస్తారు అలాంటి సమయంలో హీరోకి ఆ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఆ తర్వాత బ్లడ్ ఇచ్చే క్రమంలో ఎన్నో ట్విస్టులు ఉంటాయి. హాలీవుడ్ వాళ్ళు మన దగ్గర నుండి ఈ కాన్సప్ట్ ని కొట్టేశారు. గెట్ ది గ్రింగో లో సేమ్ ఒక్కడున్నాడు కాన్సెప్ట్ ని పెట్టి ఆ సినిమా ని తీసుకొచ్చారు హాలీవుడ్ వాళ్ళు.

Previous articleపుష్ప సినిమాలో ”తగ్గేదెలే” డైలాగ్ వెనుక కథ ఇదే..!
Next articleమందు కొట్టే ముందు ”చీర్స్” అని ఎందుకు చెప్తారు..? దాని వెనుక ఇంత పెద్ద రీజన్ ఆ…?