RRR సినిమాలో ఈ రెండు సీన్లు మిస్ అయ్యాయి.. మీరు గమనించారా..?

Ads

దర్శకధీరుడు రాజమౌళి తెర మీదకి తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. అంతర్జాతీయ లెవెల్లో ఈ సినిమాకి గుర్తింపు వచ్చింది. నాటు నాటు పాట వండర్ ని క్రియేట్ చేసేసింది. ఆర్ ఆర్ ఆర్ నుండి వచ్చిన నాటు నాటు పాటకి భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. నామినేషన్స్ కి వెళ్లడమే కాకుండా ఒరిజినల్ సాంగ్ విభాగంలో 95వ ది అకాడమీ అవార్డుని సొంతం చేసుకుంది. ప్రేమ్ రక్షిత్ సినిమాటోగ్రఫీ కీరవాణి మ్యూజిక్ చంద్రబోస్ లిరిక్స్ ఇవన్నీ కూడా మూవీకి బాగా సెట్ అయ్యాయి.

నాటు నాటు పాటని కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిపి పాడారు. రామ్ చరణ్ ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఈ రెండు సీన్స్ లేవు. ఈ రెండు సీన్లు కూడా సినిమా నుండి మిస్ అయ్యాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఎంతో అద్భుతంగా నటించి అందర్నీ బాగా ఆకట్టుకున్నారు.

Ads

అయితే సినిమాకి సంబంధించి అంతకుముందు రిలీజ్ చేసిన వీడియోలో కనపడిన సీన్స్ కొన్ని మిస్ అయ్యాయి. హీరోలు ఇద్దరు ఇంట్రడక్షన్ వీడియోస్ లో రెండు సీన్లని చూపిస్తారు. కొమరం భీమ్ ఇంట్రడక్షన్ వీడియోలో భీం ఒక పెద్ద అల ముందు నిల్చున్నట్లు మనం వీడియోలో చూసాము. కానీ సినిమాలో చూస్తే ఆ సీన్ లేదు.

అలానే సీతారామరాజు ఇంట్రడక్షన్ వీడియోని రిలీజ్ చేసినప్పుడు ఆ వీడియోలో అల్లూరి సీతారామరాజు కూర్చుని ధ్యానం చేస్తున్నట్లు చూపించారు కానీ సినిమాలో ఈ సీన్ కూడా లేదు. ఈ రెండు షార్ట్స్ కూడా సినిమాలో మనకి ఎక్కడా కనపడవు సినిమా సెన్సార్ కి వెళ్ళినప్పుడు కొన్ని సీన్లని కట్ చేస్తారు. అలానే ఈ సినిమా చివర్లో ఎండ్ క్రెడిట్స్ వచ్చే సమయంలో కూడా కొంత భాగాన్ని కట్ చేశారు.

Previous articlePonniyin Selvan movie review: పొన్నియన్ సెల్వన్ 2 స్టోరీ, రివ్యూ & రేటింగ్..!
Next articleN నుంచి S వరకు ఉన్న అక్షరాలతో మీ పేరు స్టార్ట్ అవుతుందా..? అయితే రానున్న రోజుల్లో ఇదే జరుగుతుంది..!