సౌందర్య చనిపోయిన నెల తరువాత వాళ్ళ ఇంటికి వెళ్ళా.. ఎంట్రన్స్ ఏమో అలా.. ఆమని షాకింగ్ కామెంట్స్..!

Ads

సౌందర్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సౌందర్య చాలా సినిమాలు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. ఎక్స్పోజింగ్ తో కాకుండా అభినయంతో ఆకట్టుకున్న నటలలో ఆమె కూడా ఒకరు. చిన్న వయసులోనే వందకు పైగా సినిమాల్లో నటించారు సౌందర్య పైగా తక్కువ సమయంలోనే ఒక పెద్ద స్టార్ హీరోయిన్ గా మారిపోయారు సౌందర్య కానీ ఆమె దురదృష్టవశాత్తు 30 ఏళ్లకే తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు. విమాన ప్రమాదంలో సౌందర్య మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె చనిపోయినా కూడా ఇప్పటికీ చాలా మంది హృదయాల్లో నిలిచిపోయారు.

ఆమె నటించిన సినిమాలు చూసి ఇంకా మెచ్చుకునే అభిమానులు ఆమెకి ఉన్నారు. అయితే సౌందర్య గురించి ఆమని కొన్ని విషయాలని గతంలో ఒక ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకున్నారు. ఆమని చెప్పిన విషయాలు చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఆమని సౌందర్య ఇద్దరు మంచి సన్నిహితులుగా మెలిగేవారట. సౌందర్య చనిపోయారు అన్న విషయం ఆమని కి తెలియగానే ఆమె అవాక్కయ్యారు ఇది ఏదో ఫేక్ వార్త అయి ఉండొచ్చు అని అనుకున్నారు.

Ads

సౌందర్య కి ఆమని కాకుండా ఇంకా ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి ఉండొచ్చు కానీ ఆమని  మాత్రం సౌందర్య చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్ అని ఆ ఇంటర్వ్యూలో ఆమని చెప్పారు. పెళ్లి అయిన తర్వాత కూడా సౌందర్య తో అప్పుడప్పుడు మాట్లాడేది అని ఆమని అన్నారు కానీ వాళ్ళ ఇంటికి రమ్మని చాలాసార్లు పిలిచింది కానీ నేను వెళ్లలేక పోయానని ఆమని బాధపడ్డారు. అయితే సౌందర్య మరణించడం అనేది ఫేక్ న్యూస్ అని అనుకున్నాను కానీ తను నిజంగా చనిపోయిందని తెలిసేసరికి ఆ విషయాన్ని తట్టుకోలేకపోయాను… అప్పటికి ఆమని షూటింగ్లో ఉన్నారట.

చేతులు కాళ్లు వణుకు పుట్టాయి. సౌందర్య అంత్యక్రియలకి వెళ్లలేకపోయారట ఆమని. తర్వాత సౌందర్య అమ్మని కలుసుకున్నారు అలాంటి పరిస్థితుల్లో సౌందర్య తల్లిని చూడలేకపోయానని ఆమని చెప్పుకొచ్చారు. తర్వాత ఒకసారి అటువైపు వెళ్ళినప్పుడు సౌందర్య అమ్మని చూడాలని వాళ్ళ ఇంటికి వెళ్ళా కానీ అక్కడ ఇంటిని చూసి షాక్ అయ్యానని ఆమని అన్నారు. సౌందర్య వాళ్ళ ఇల్లు ఒక బూత్ బంగ్లాలా మారిపోయిందట ఆ ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ వాళ్ళని అడిగితే షిఫ్ట్ అయిపోయారని అక్కడ ఎవరూ ఉండడం లేదని చెప్పారట.

watch video:

Previous article1990 లో ఉన్నట్టు ఇంకా ఆ సీన్లు ఏంటి బాలయ్య…”భగవంత్ కేసరి”లో సీన్ ని అందుకేగా ట్రోల్ చేసేది.!
Next article“జై శ్రీరామ్” అంటే తప్పేంటి…అప్పుడు మన ప్లేయర్స్ మీద రాళ్లు వేసింది మరిచిపోయారా.?