Ads
చాలా మంది దర్శకులు సినిమాకు దర్శకత్వం వహించి హీరోగా కూడా నటించారు. కాంతారా హీరో డైరెక్టర్ అయిన రిషబ్ శెట్టి కాంతారా సినిమాకి దర్శకత్వం వహించారు. అలానే హీరోగా కూడా నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఇలా చాలామంది దర్శకులు నటులుగా కూడా సినిమాల్లో నటించి ప్రశంసలు పొందారు. డైరెక్టర్ శంకర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.డైరెక్టర్ శంకర్ ఊహించని సబ్జెక్టుతో సినిమాని తీస్తూ ఉంటారు.
సూపర్ క్రేజీ డైరెక్టర్ అని అందుకే ఈయనకి పెట్టింది. శంకర తీసిన ఏ సినిమా అయినా కూడా తీయడానికి డైరెక్టర్లు భయపడతారు. డైరెక్టర్ శంకర్ మంచి సబ్జెక్టులతో ఎన్నో మూవీస్ ని తీసుకొచ్చారు. పాన్ ఇండియా లెవెల్ లో డబ్ చేశారు కూడా.
ఇండస్ట్రీకి శంకర్ నటుడు అవ్వాలని వచ్చారు అయితే నటన తన వల్ల కాదని తను తెలుసుకొని ఎస్సే చంద్రశేఖర్ వంటి వాళ్ళ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో శంకర్ పని చేశారు. మూడేళ్ల తర్వాత జెంటిల్ మెన్ అనే సినిమా స్టోరీ ని తీసుకుని అర్జున్ హీరోగా ఈ సినిమాని తెరమీదకి తీసుకువచ్చారు. పెద్ద విజయం కూడా అయింది.
Ads
అప్పటినుండి ఇప్పటివరకు శంకర్ ఎన్నో అద్భుతమైన సినిమాలని తెర మీదకి తీసుకొస్తూనే వున్నారు. అయితే దర్శకుడిగా రాకముందు కొన్ని సినిమాల్లో శంకర్ నటించారు. మొట్టమొదట 1985లో వేషం అనే సినిమాలో కనపడ్డారు. 1986లో పూవుమ్ పూయలం, వసంత రాగం అనే సినిమాల్లో నటించారు తర్వాత ఒక నాలుగేళ్లకి సీత అనే ఒక సినిమాలో నటించారు. ఆ సినిమాలో జపాన్ అనే ఒక పాత్రను చేశారు.
1994 లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన ఇండియన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు శంకర్. ఈ సినిమా తెలుగులో భారతీయుడు పేరుతో రిలీజ్ అయింది. తర్వాత ఆయన దర్శకత్వం వహించిన కాదల్ వైరస్, శివాజీ వంటి సినిమాల్లో స్పెషల్ ఎపీరియన్స్ లో కనపడ్డారు. 2012లో ఆయన చివరిసారిగా తెర మీద కనపడ్డారు అప్పటినుండి మళ్ళీ సినిమాల్లో కనపడలేదు శంకర్.