Ads
సినిమా: రామబాణం
నటీనటులు : గోపీచంద్, డింపుల్ హయాతి, నాజర్, ఖుష్బూ, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్,
తరుణ్ అరోరా తదితరులు
దర్శకత్వం : శ్రీనివాస్
నిర్మాత : TG విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
సంగీతం : మిక్కీ జె మేయర్
విడుదల తేదీ : 05,మే 2023
స్టోరీ :
విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడు ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. కారణం తన అన్న (జగపతి బాబు). అతని తో ఉన్న గొడవలు వలనే విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడు ఇంటిని వదిలి వెళ్ళిపోతాడు. ఈస్ట్ గోదావరిలో ఉన్న రాఘవేంద్రపురంలో విక్కీ అన్న హోటల్ నడుపుతాడు. తర్వాత కోల్‌కతా లో పెద్ద డాన్ అయిపోతాడు. విక్కీ భైరవి (డింపుల్ హయాతి) అని ఓ యూట్యూబర్ ని లవ్ చేస్తాడు.
కొన్ని కారణాల వలన మళ్ళీ విక్కీ ఇంటికి వస్తాడు. తర్వాత తన అన్న సమస్యల్లో ఉన్నాడని తెలుస్తుంది. ఆ సమస్యల నుండి విక్కీ ఎలా బయటకి వస్తాడు..? అన్నదమ్ములు మళ్లీ కలుస్తారా..? వాళ్లకి ఎదురైనా సమస్య ఏమిటి అనేది తెలియాలంటే సినిమాని చూడాలి.
రివ్యూ:
గోపీచంద్ మరొక ఎంటర్టైనింగ్ పాత్రతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సినిమా మొత్తం కూడా ఒక ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. అయితే కథ కాస్త రొటీన్ గా ఉంటుంది. సినిమా తీసిన పద్ధతి ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సినిమా మొదటి హాఫ్ కాస్త బోరింగ్ గా స్లోగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అయితే రొటీన్ గా అందరికీ అనిపించింది. కానీ కామెడీ సీన్లు అందరికీ నచ్చుతాయి.
Ads
ఈ సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. అయితే సెకండ్ హాఫ్ ని కొంచెం డెవలప్ చేసి ఉంటే సినిమా చాలా బాగుండేది. కానీ యావరేజ్ గానే నిలిచింది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అయ్యేలా చేశారు. ఈ సినిమాలో నటించిన నటీనటులు వాళ్ళ పాత్రకి న్యాయం చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సాంగ్స్ బాగున్నాయి.
అయితే రొటీన్ గానే కథ ఉండడంతో సినిమా బాగా అందరికీ కనెక్ట్ అవ్వలేదు. కొత్తగా కథ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు అయితే ఈ సినిమాలో చూపించిన కొన్ని ఎమోషన్స్ సీన్లు అయితే అందరికీ నచ్చుతాయి. బాగా వచ్చాయి. సినిమా మీద ఏమాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే కచ్చితంగా నిరాశపరచదు.
ప్లస్ పాయింట్స్:
నటీ, నటులు
కొన్ని సీన్స్ లో కామెడీ
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ సాగదీత సన్నివేశాలు
బోరింగ్ గా అనిపించే కొన్ని సీన్స్
రేటింగ్: 3/5