Ads
చాలామంది శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా శివుడు కి పూజలు చేస్తూ ఉంటారు. శివాలయానికి వెళ్లడం, సోమవారం నాడు శివాలయానికి వెళ్లి పూజలు చేయడం అర్చన చేయించుకోవడం ఇటువంటివి చేస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శివాలయంలో ఎలా ప్రదక్షిణాలు చేయాలి అని… శివాలయంలో ప్రదక్షిణాలు చేయడానికి ఒక పద్ధతి ఉంది, చాలా మందికి ఈ పద్ధతి గురించి తెలియదు.
మరి ఆ విషయాన్ని తెలుసుకొని ఈసారి శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేసే క్రమంలో ఈ తప్పులను చేయకుండా చూసుకోండి. శివాలయానికి వెళ్ళినప్పుడు నేరుగా శివుడిని మనం దర్శనం చేసుకోకూడదు. నంది రెండు కొమ్ముల మధ్యలో నుండి మనం శివుడిని చూడాలి.
ఆ తర్వాత దర్శనం చేసుకుని వచ్చాక అప్పుడు ప్రదక్షిణాలు చేయాలి మామూలుగా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే పూర్తిగా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. అంటే గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాము కానీ శివాలయంలో మాత్రం అలా కాదు. మనం శివాలయంలో ప్రదక్షణాలను మొదలు పెట్టినప్పుడు మనం ప్రదక్షిణం చేసి గుడి వెనుక భాగం నుండి ముందుకు వస్తున్నప్పుడు మనకి సోమ సూత్రం ఉంటుంది.
Ads
సోమ సూత్రం అంటే ఏంటంటే గుడిలోపల శివుడికి చేసే అభిషేక తీర్థం అంతా కూడా బయటికి వచ్చే చోటు. దానిని దాటి ఎప్పుడూ వెళ్ళకూడదు. అది చండీశ్వర క్షేత్రం. అక్కడ చండేశ్వరుడు కొలువై ఉంటాడు. అది దాటి ఎప్పుడూ కూడా ప్రదక్షిణం చేయకూడదు. అక్కడ దాకా ప్రతిక్షణం చేశాక మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఏ ఆలయంలో కూడా అలా లేదు ఇక్కడ మాత్రమే అలా ఉంటుంది.
ఇలా మీరు ఎన్ని సార్లు ప్రదక్షిణాలు చేయాలనుకుంటే అన్ని సార్లు కూడా ఇదే పద్ధతిలో ప్రదక్షిణాలు చెయ్యాలి. ప్రదక్షిణాలు చేసేటప్పుడు వేగంగా కంగారుగా చేయకూడదు అడుగులో అడుగు వేసుకుంటూ నెమ్మదిగా చేయాలి. శక్తితో మనం వెళ్తున్నామని గుర్తుంచుకొని భక్తితో ప్రదక్షిణం చేయాలి. ఏదైనా శ్లోకం చదువుకుంటూ కానీ ఏదైనా దైవాన్ని స్మరించుకుంటూ కానీ ప్రదక్షిణం చేయాలి. మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు.