ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాలు ఇవే.. ఫుల్ లిస్ట్ ని చూసేయండి మరి..!

Ads

ఇండియాలో కొన్ని సినిమాలని బ్యాన్ చేశారు. కమల్ హాసన్ హే రామ్ మొదలు చాలా సినిమాలను ఇండియాలో బ్యాన్ చేయడం జరిగింది. ది కేరళ స్టోరీ మే 7 న విడుదల అయిన విషయం తెలిసిందే కానీ ఆ సినిమాని కొన్నిచోట్ల బ్యాన్ చేసినప్పటికీ కలెక్షన్ల పరంగా సినిమాకి ఎలాంటి లోటు లేక పోయింది, విడుదలైన నాలుగు రోజుల్లోనే 40 కోట్లకు పైగా వసూలు చేసింది సినిమా. ఇక మరి ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్టు చూద్దాం.

ఆమె:

అమలాపాల్ నటించిన ఆమె సినిమా ని మన ఇండియా లో బ్యాన్ చేసారు.ఈ సినిమా లో ఆమె బట్టలు లేకుండా నటించడం వలన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అందుకే ఈ సినిమా ని బ్యాన్ చేసారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్:

ఈ సినిమా విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా
2019 ఎలక్షన్స్ సమయం లో రిలీజ్ చెయ్యకూడదు అని చెప్పి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసారు.

బండిట్ క్వీన్:

బండిట్ క్వీన్ చిత్రాన్ని కూడా బ్యాన్ చేసారు. ఈ సినిమా బందిపోటు రాణి ఫూలన్ దేవి కధాంశంతో తీశారు. 1994లో ఈ సినిమాని రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ సినిమా ని బ్యాన్ చేసారు.

హే రామ్ :

హీరో కమల్ హాసన్, షారుఖ్ ఖాన్ నటించిన ఈ హే రామ్ సినిమా ని రిలీజ్ చేసేటప్పుడు ఆటంకాలు ఏర్పడ్డాయి. దానితో ఈ మూవీ ని రిలీజ్ చేయలేదు.

ఉర్ఫ్:

ఈ చిత్రంలో కూడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండడం.. ఈ మూవీ ని కూడా ఇండియా లో బ్యాన్ చేసారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమునే సృష్టించింది.

Ads

పరంజియా:

ఇండియా లో ఈ సినిమా ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో కూడా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండడం తో.. ఈ మూవీ ఆపేయమని ప్రభుత్వాలు స్టే ఇచ్చాయి కూడా.

సిన్స్:

సిన్స్ మూవీ ని కూడా బ్యాన్ చేసారు. ఈ చిత్రాన్ని కూడా విడుదల అవ్వకుండానే బ్యాన్ చేయడం జరిగింది. అస్లీలత వలనే అలా చేసారు.

పాంచ్:

ఇండియా లో ఈ సినిమా ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. ఈ చిత్రంలో హింస ఎక్కువగా ఉందని ఇండియా వైడ్ బ్యాన్ చేసారు.

ది పింక్ మిర్రర్ :

ఈ సినిమా విషయంలో కూడా అలానే జరిగింది. ఇందులో ఇద్దరు మహిళలు శృంగారంలో పాల్గొనడం వంటి సీన్స్ వున్నాయి. అయితే ఇవి యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని.. బ్యాన్ చేయడం జరిగింది.

ఫైర్:

ఇద్దరు ఆడవాళ్ళు భర్త తో విడిపోయి ప్రేమలో పడతారు. దీనితో వివాదాలకు దారి తీయడంతో విడుదలకు అడ్డంకులు వచ్చాయి.

బ్లాక్ ఫ్రైడే :

అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని ఈ సినిమా విడుడల కాకుండా ప్రభుత్వం అడ్డుకుంది. అందుకే ఈ సినిమా కూడా రిలీజ్ కాలేదు.

ఫిరాక్:

ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డులు ఈ మూవీ కి వచ్చాయి. అయినా కూడా ఈ సినిమా విడుదలకు ప్రభుత్వాలు అంగీకరించకుండా బ్యాన్ చేసాయి.

 

Previous articleఈ 4 విషయాలని ఎంత మంచి భర్య అయినా కూడా.. భర్త తో చెప్పదు..!
Next articleపొగాకు, గుట్కా యాడ్లలో కనపడే వీళ్ళు ఎవరు..? బాధితులేనా, నటులా..?