Ads
ఎండ ఎక్కువగా ఉంటే ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. వేడి వలన ఎండ వలన చికాకు వస్తుంది. అయితే కొంచెం డబ్బులు ఉన్నవాళ్లు కూడా ఈ రోజుల్లో ఏసీ ని పెట్టుకుంటున్నారు చాలామంది ఇళ్లల్లో ఉదయం నుండి రాత్రి వరకు ఏసీలు అలా రన్ అవుతూనే ఉంటాయి. కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అనే మాటని కూడా పక్కన పెట్టేశారు.
కంఫర్ట్ కోసం చూసుకుంటూ ఉదయం నుండి సాయంత్రం వరకు ఏసీ ని ఆన్ చేస్తూనే ఉంటున్నారు. చాలామంది సాధారణ ప్రజలు కూడా ఇంట్లో ఏసిని ఇన్స్టాల్ చేయించుకుంటున్నారు. అయితే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట్లో మాత్రం ఏసీ లేదు. దేశంలో అత్యంత ధనవంతులైన ముకేశ్ అంబానీ ఇంట్లో ఏసీని ఎందుకు పెట్టుకోలేదు.. దాని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
అంబానీ ఇంటి గోడలు శక్తిని గ్రహించబడే వాటిగా తయారు చేయబడ్డాయి. ఇంటి ఉష్ణోగ్రతను మనకే కావాల్సినట్లుగా సెట్ చేసుకోవచ్చు. దీనిని యాంటిలియా అంటారు. 2012 నుండి ముకేశ్ అంబానీ వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ముంబైలో ఇది ఉంది 27 ఫ్లోర్లతో ఇది ఉంది. ఈ యాంటిలియా హైట్ వచ్చేసి 173 మీటర్లు. ముకేశ్ అంబానీ యాంటిలియాలో ఏసి అవసరం లేదు కనుక పెట్టలేదు.
Ads
చికాగో కి చెందిన ఆర్కిటెక్లు పెర్కిన్స్ అండ్ విల్ డిజైన్ చేశారు దీన్ని ఆస్ట్రేలియా నిర్మాణ సంస్థ లైట్ అండ్ హోల్డింగ్స్ నిర్మించింది. స్విమ్మింగ్ పూల్స్, సెలూన్, 50 మంది కూర్చుని చూసే మినీ థియేటర్ ఇవన్నీ కూడా ఈ భవనంలో ఉన్నాయి. భవనం చివరి నాలుగో అంతస్తులో ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులు ఉంటారు. దాదాపు 8 వేల కోట్లు ఉంటుంది ఇది.
ఈ భవనం దాదాపు రికార్డ్స్ స్కేల్ పై 8.0 తీవ్రతతో భూకంపం సంభవించినా కూడా తట్టుకోగలదు. 600 మంది స్టాఫ్ నిత్యం ఇక్కడ పని చేస్తూ ఉంటారు. 168 కార్లు పార్కింగ్ చేసేందుకు ఇక్కడ కావాల్సినంత స్థలం ఉంది. దక్షిణ ముంబై మధ్యలో ఈ భవనం ఉంది. ఈ భవనాన్ని కట్టడానికి రెండేళ్లు పాటు సమయం పట్టింది.
ఆరవ అంతస్తుల కారు పార్కింగ్, గ్రాండ్ ఎంట్రెన్స్, విలాసమైన లివింగ్ రూమ్స్ వంటివి ఇక్కడ ఉన్నాయి. బకింగ్ హామ్ ప్యాలెస్ తర్వాత ఖరీదైన భవనంగా ఇది నిలిచింది. పైగా దీనిలో మొత్తం తొమ్మిది లిఫ్ట్లు ఉన్నాయి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ డబ్ల్యూ మాదిరిగా దీనిని రూపొందించారు ఈ భవనాన్ని సూర్యుడు లోటస్ ఆధారంగా రూపొందించడం జరిగింది. పైగా మరో విశేషం ఏంటంటే ముంబై వేడి నుండి ఉపశమనం లభించడానికి ఇందులో స్నో రూమ్ కూడా ఉంది అందులో ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది వాటి యొక్క గోడలు కృత్రిమ స్నోప్లెక్స్ తో ఉంటాయి.