రాజమౌళి అన్ని సినిమాల్లో… ఈ కామన్ పాయింట్ ని గమనించారా..?

Ads

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రాజమౌళి సినిమా అంటే ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా బాహుబలి రికార్డులకు ఎక్కింది. బాహుబలి సినిమా తర్వాత చాలామంది హీరోలు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలని చూస్తున్నారు.

నిజానికి రాజమౌళితో సినిమాలు చేయాలని చాలామంది హీరోలు కలలు కంటూ ఉంటారు. రాజమౌళి సినిమాల్లో ఎక్కువ శాతం ఆకర్షించడానికి కమర్షియల్ అంశాలు ఉంటాయి. పైగా కథ కూడా ఎప్పుడు ఆసక్తికరంగా ఉండేలా రాజమౌళి తెర మీదకి తీసుకువస్తూ ఉంటారు.

దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఎప్పుడూ ఒక కామన్ పాయింట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా…? మరి అది ఏంటో ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు కామన్ పాయింట్ ఉంది రాజమౌళి తీసే ఏ సినిమాకైనా కూడా ఒక బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది.

దాని ఆధారంగా సినిమాని తీసుకువస్తూ ఉంటారు, పైగా ఆ పాయింటే ఆడియన్స్ ఎమోషనల్ తో సినిమాకి సూపర్ హిట్ ఇస్తుంది. ఇలా రాజమౌళి తన దర్శకత్వంలో ఒక కామన్ పాయింట్ ఉండేలా చూసుకుంటారేమో.. మరి రాజమౌళి తీసిన ఈగ, సింహాద్రి, బాహుబలి 1, బాహుబలి 2, మగధీర, యమదొంగ ఇలా ఏ సినిమాకైనా కూడా బ్యాక్ గ్రౌండ్ స్టోరీ అనేది ఉంటుంది. ఒక హీరో ఉంటాడు.

Ads

వాళ్ళ అమ్మ కానీ లేదంటే స్నేహితుడు కానీ నాన్న కానీ హీరో లేదా హీరోయిన్ కానీ వాళ్ళకి బ్యాగ్రౌండ్ స్టోరీ అనేది ఉంటుంది. స్టోరీని బేస్ చేసుకుని బ్యాగ్రౌండ్ లో ఒక టార్గెట్ పెట్టుకుని హీరో అందుకోసం పోరాడుతూ ఉంటాడు. చివరికి హీరో గెలుస్తాడు.

  1. ఈగ:

ఈగ సినిమాను చూసినట్లయితే హీరో హీరోయిన్ కోసం విలన్ హీరోని చంపేస్తే హీరో ఈగ లాగ మారుతాడు. వీళ్ళని చివరికి చంపుతాడు. ఇలా రాజమౌళి అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించి సూపర్ సినిమాని తీసుకొచ్చారు.

2. ఛత్రపతి:

ఛత్రపతి సినిమాలో వాళ్ళ అమ్మని బేస్ చేసుకుని ఫ్యామిలీ ఎమోషన్ ని పండించాడు రాజమౌళి. హీరో ఎక్కడ నుండో వస్తాడు కూలీగా పని చేస్తాడు. అక్కడ వాళ్ళ అరాచకం తట్టుకోలేక ఎదిరిస్తాడు. చివరికి సక్సెస్ అవుతాడు.

3. ఆర్ ఆర్ ఆర్:

ఈ సినిమా విషయానికి వస్తే రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తానన్న మాట కోసం పోలీస్ ఆఫీసర్ బ్రిటిష్ తుపాకులతో బ్రిటిష్ పై యుద్ధం చేయడం కోసం రామ్ వస్తాడు. బ్యాక్గ్రౌండ్ స్టోరీ బీమ్ మల్లి కోసం వస్తాడు. చిన్నచిన్న గొడవలు భీమ్ రామ్ ని అర్థం చేసుకుని రామ్ కోసం పోరాడుతాడు. ఆఖరికి నాన్న కోరిక తీరుస్తాడు రామ్. చివరికి హీరో గెలుస్తాడు ఎమోషనల్ గా ఆడియన్స్ ని కనెక్ట్ చేసాడు రాజమౌళి. ఇలా రాజమౌళి సినిమాలు ఉంటాయి.

 

Previous articleఈ ఫొటోలో మీరు మొదట ఏం చూసారు..? మీ పెర్సనాలిటీ ఏమిటో తెలుసుకోవచ్చు..!
Next articleపూజ సమయంలో కొట్టిన‌ కొబ్బరికాయ కుళ్ళిపోతే.. ఏం అవుతుంది..?